/rtv/media/media_files/2025/02/16/P6NovmhF4eCjKWEyH4zP.jpg)
Car drags man for 50 metres in Bengaluru
కర్ణాటక (Karnataka) లోని బెంగళూరులో దారుణం జరిగింది. టోల్‌గోట్ వద్ద గోడవ జరగడంతో కారులో ఉన్నవారు ఓ వ్యక్తిని కొంతవరకు లాక్కెళ్లి పడేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని నెలమంగళలో టోల్‌బూత్ ఉంది.
Also Read: గుండెపోటుతో వరుడు ఎలా మృతి చెందాడో చూడండి.. వీడియో చూస్తే గుండె పగలాల్సిందే!
ఆ టోల్‌బూత్ వద్ద ఓ కారును మరో కారు ఓవర్ టేక్ చేసింది. దీంతో ఆ కారులో ఉన్న వ్యక్తి ముందుకు వచ్చి ఓవర్ టేక్ చేసిన కారు (Car Over Taking) లో ఉన్న వ్యక్తిని ప్రశ్నించాడు. ఇలా ఎందుకు చేశావంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి వాగ్వాదం చెలరేగింది. దీంతో ముందు కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కోపంతో రగిలిపోయాడు. తన కారును స్టార్ట్ చేశాడు.
Also Read : వైసీపీ కీలక నేత మృతి.. జగన్ దిగ్భ్రాంతి!
Bengaluru Crime
Shocking Incident in Bengaluru!
— Shubham Rai (@shubhamrai80) February 16, 2025
A man was dragged for 50 meters by a car at Nelamangala toll booth after an argument over overtaking. The entire incident was caught on CCTV. Police have launched an investigation to identify the accused. #Bengaluru #RoadRage #ViralVideo pic.twitter.com/mFJ8YOMXoQ
గొడవకు దిగిన వ్యక్తి కాలర్ పట్టుకునే కారును ముందుకు డ్రైవ్ చేశాడు. దాదాపు 50 మీటర్ల వరకు ఆ కారు అతడిని ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత అతడిని వదిలపెట్టడంతో ఆయన కిందపడిపోయాడు. ఆ కారు డ్రైవర్ ఆగకుండానే వేగంగా దూసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సమాచారం మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read : ప్రేమించాడు.. కానీ పెళ్లి చేసుకోనన్నాడు.. ప్రేమికుల రోజునే యువతి ఆత్మహత్య!