/rtv/media/media_files/2025/02/16/Uy0oZWk1WexbSbu1jKeK.jpg)
Husky Turns Aggressive Attacks Man
ప్రపంచ వ్యాప్తంగా పెట్స్ ప్రియులు (Pet Lovers) చాలామందే ఉన్నారు. అందులో డాగ్స్‌పై ప్రేమ చూపించే వారు అత్యధికం. రోజంతా వాటితోనే గడుపుతారు. ఎలాంటి స్వార్థం లేని డాగ్స్‌తో వారి ప్రేమను పంచుకుంటారు. ఇక ఎన్ని చేసినా.. వాటికి తిక్క రేగితే అంతే సంగతులు. తన మన అనే భేదం లేకుండా దాడి చేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. పెంచుకున్న డాగ్ (Pet Dog) ని క్లీనిక్‌కు తీసుకెళ్లారు. తమతో పాటే ఆ డాగ్‌ను పక్కన పెట్టుకున్నారు. కానీ అది సడెన్‌గా వారిపైనే దాడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Also Read : Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!
Pet Dog Suddenly Attacks Man
వీడియో ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు హస్కీ అనే డాగ్‌తో క్లినిక్‌లోని సోఫాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మొదట హస్కీ బాగానే ఉంది. ఆ గదిలోని వారి చుట్టూ తిరుగుతూ కనిపించింది. ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా హస్కీ దూకుడుగా మారి, వారిలో ఒకరిపై దాడి చేసింది.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
అతడి చేతిని తన పళ్లతో గట్టిగా పట్టుకుంది. దీంతో అతడు ఒక్కసారిగా ఆ డాగ్ దాడిని నివారించడానికి ప్రయత్నించాడు. ఎంతో సేపు దాని పళ్లను విడిపించాలని చూస్తాడు. కానీ అది మాత్రం గట్టిగా తన పళ్లతో ఆ వ్యక్తి చేతిని వదల్లేదు. చివరికి ఎంతో సేపు పోరటం తర్వాత అతడు హస్కీని క్లినిక్ బయటకు నెట్టగలుగుతాడు.
Pet Dog attacks on a Guy who was Playing with the Dog inside Clinic
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 14, 2025
pic.twitter.com/PAZaXZRoqS
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
ఆపై దాడిలో గాయపడిన తన చేతిని చూసుకుంటాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో ఒక వినియోగదారు స్పందిస్తూ.. ‘‘ఇది దురదృష్టకరం! పెంపుడు జంతువుల యజమానులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సంఘటనలను నివారించడానికి వారి కుక్క ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. వ్యక్తి సురక్షితంగా ఉంటాడని ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చాడు.