New Jobs In Japan: ప్రధాని మోదీ జపాన్ పర్యటన.. 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు

రెండు రోజులుగా ప్రధాని మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన ఎన్నో కీలకమైన ఒప్పందాలను చేసుకున్నారు. వాటిల్లో భారతదేశ యువతకు ఉద్యోగాలు కల్పించే పథకం ఒకటి.  ఇరు దేశాల్లో కలిపి 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించుకున్నారు.

New Update
japan modi

రెండు రోజుల పర్యటనలో బాగంగా జపాన్ లో ఉన్న ప్రధాని మోదీ(pm modi) ఆ దేశంలో కీలక ఒప్పందాలను చేసుకున్నారు. ఆర్థిక సహకారం, ఆరోగ్యం, ఏఐ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం పెంచుకునే దిశగా చేతులు కలిపారు.ఇందులో భాగంగా జపాన్ తో భారత్ కీలక భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. చంద్రుడి మీద పరిశోధనలు చేసే చంద్రయాన్ 5 కు ఆ దేశంతో కలిసి పని చేయనుంది. దీని కోసం ఇరు దేశాల అంతరిక్ష సంస్థలూ కలిసి పని చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. దీంతో పాటూ ఆర్థిక సహకారం, ఆరోగ్యం, ఏఐ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాల ప్రధానులు ఈ పర్యటనలో చర్చించుకున్నారు. జపాన్ తో కలిసి పని చేయడం వలన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకునే వీలు కలుగుతుందని ప్రధాని మోదీ చెప్పారు. 

Also Read :  39ఏళ్ల గుండె డాక్టర్‌నే కాటేసిన హార్ట్‌అటాక్.. హాస్పిటల్ డ్యూటీలోనే స్పాడ్‌డెడ్

5లక్షల ఉద్యోగాలు..

భారత్, జపాన్ ఉపాధికి సంబంధించి రెండు దేశాల మధ్యనా చాలా ముఖ్యమైన ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం రాబోయే 5 ఏళ్ళల్లో 50 వేల మంది నైపుణ్యం కలిగిన, సెమీ స్కిల్డ్ వర్కర్లకు ఉపాధి కల్పించనున్నారు. ఈ ఐదేళ్ళల్లోనే 5 లక్షల మంది ఉద్యోగులను ఇరు దేశాలు మార్పిడి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని వలన అటు జపాన్ తో పాటూ ఇటు భారత యువత ప్రతిభకు కొత్త ఉద్యోగ అవకాశాలను(New Job Oportunities) సృష్టిస్తుంది. జపాన్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ.. భారతదేశంలో పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన, సెమీ-స్కిల్డ్ మానవశక్తి అందుబాటులో ఉందని రెండు దేశాలు గుర్తించాయని, జపాన్ ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాలలో కార్మికుల కొరత ఉందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ఒప్పందం కుదిరిందని చెప్పారు. మరోవైపు జపాన్ లో కూడా కొన్ని రంగాల్లో కార్మికుల కొరత ఉంది. అందుకు సంబంధించిన వారు భారత్ లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు ఇరు దేశాలు శ్రామిక శక్తిని మార్పిడి చేసుకోవడం వలన ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా, ఉమ్మడి పరిశోధన, వాణిజ్యీకరణ , విలువ వృద్ధిలో కూడా సహకరిస్తాయని మిస్రీ తెలిపారు. 

జపాన్ నుంచి చైనాకు..

జపాన్ పర్యటన తరువాత ప్రధాన మోదీ(PM Modi Japan Tour) అక్కడి నుంచి డైరెక్టుగా చైనాకు వెళతారు. ఆగస్టు 31న జరిగే ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇందులో చైనా, ఇండియాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటూ..ఒకరికొకరు సహకారాన్ని విస్తృతం చేసే విధంగా చర్చించనున్నారు. రెండు దేశాలు కట్టుబడి పని చేసేందుకు  ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ తో పాటూ రష్యా అధినేత పుతిన్ తో కూడా భేటీ అవ్వనున్నారు. 2020లో లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారత్, చైనాలపై అమెరికా సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ ప్రధాని మోదీ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: Mark Zukerberg: ట్రంప్ డిజిటల్ పన్నుల ఆగ్రహం వెనుక మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్?

Advertisment
తాజా కథనాలు