Heart attack: 39ఏళ్ల గుండె డాక్టర్‌నే కాటేసిన హార్ట్‌అటాక్.. హాస్పిటల్ డ్యూటీలోనే స్పాడ్‌డెడ్

చెన్నైలోని సవితా మెడికల్ కాలేజీలో కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్(39) డ్యూటీలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన తోటి డాక్టర్లు రాయ్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.

New Update
Cardiac surgeon dies

Cardiac surgeon dies

ప్రాణాలు కాపాడే డాక్టర్‌కే గుండెపోటు రావడంతో తమిళనాడులోని చెన్నైలో విషాదం నెలకొంది. అది కూడా 39ఏళ్లకే ఓ కార్డియాక్ సర్జన్ చనిపోవడం షాకింగ్‌గా మారింది. చెన్నైలోని సవితా మెడికల్ కాలేజీలో కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్(39) విధుల్లో ఉండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన తోటి డాక్టర్లు, వైద్య సిబ్బంది డాక్టర్ గ్రాడ్లిక్ రాయ్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.

ఈ ఘటన గత బుధవారం జరిగింది. డాక్టర్ రోజూలాగే డ్యూటీలో పేషంట్లను పరిశీలిస్తున్న రౌండ్స్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. తోటి డాక్టర్లు వెంటనే స్పందించి సీపీఆర్ (CPR), స్టెంటింగ్, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్ వంటి చికిత్సలు అందించారు. అయినా, ఎడమ ప్రధాన ధమని పూర్తిగా మూసుకుపోవడం వల్ల తీవ్రంతో హార్ట్ అటాక్ వచ్చింది. దాని నుంచి కోలుకోవడం సాధ్యం కాలేదని వైద్యులు తెలిపారు. ఈ విషాద ఘటన ఆయన కుటుంబానికి, వైద్య రంగానికి తీరని లోటు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

కేవలం 39 ఏళ్ల వయసులోనే డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ మరణించడం డాక్టర్లను షాక్‌కు గురిచేసింది. ఆయన మరణంపై పలువురు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లకు ఉండే తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, స్టెబల్ లైఫ్‌స్టైల్, సరైన పోషకాహారం లేకపోవడం వంటివి గుండె సమస్యలకు దారితీస్తున్నాయని హైదరాబాద్‌లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ Xలో అలర్ట్ చేశారు. ప్రాణాలు నిలబెట్టే వైద్యులే తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు.

గత కొన్నేళ్లుగా భారతదేశంలో 30, 40 ఏళ్ల వయసు డాక్టర్లు గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇది ఒక ఆందోళనకరంగా మారింది. డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ మరణం, వైద్యులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.

Advertisment
తాజా కథనాలు