/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/jaisankar-jpg.webp)
Jaishankar On India-US Trade Deal
Jaishankar On India-US Trade Deal: అమెరికా(America) విధించిన ప్రతీకార సుంకాల(Tariffs)పై ఆ దేశంతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వాటిని 90 రోజుల పాటూ నిలిపివేస్తున్నట్టు ట్రంప్(Trump) ప్రకటించారు. అయితే తరువాత మాత్రం తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. దీనిపై దాదాపు 75 దేశాలు వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికాతో చర్చలు జరిపాయి. అందులో భారత్ కూడా ఒకటి. అయితే ఇవేమీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు.
Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!
అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య చర్యలు సంక్షిష్టమైనవి అని...వాటి విషయంలో అంత తొందరగా ఒక నిర్ణయానికి రాలేమని చెప్పారు. ఏ విషయం అయినా అమలు అయ్యే వరకూ నిర్ణయించామని చెప్పడం కష్టమని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఏ వాణిజ్య ఒప్పందం అయినా రెండు దేశాలకూ ప్రయోజకరంగా ఉండాలని ఆయన చెప్పారు. అందుకే ఇలాంటి వాటిల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని జై శంకర్ అన్నారు.
జీరో టారీఫ్ లేదు..
మరోవైపు దోహాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం అమెరికాకు జీరో టారిఫ్ ట్రేడ్ ఒప్పందాన్ని అందిస్తుందని అంటూ సంచలన ప్రకటన చేశారు. అమెరికా వస్తువులపై సుంకాలను తొలగించడానికి భారత్ ముందుకొచ్చిందని అన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో ఏదైనా అమ్మడం చాలా కష్టమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ జీరో సుంకాల విషయంపై భారత్ మాత్రం అధికారికంగా ఏ ప్రకటనా చేయలేదు. దాని గురించి అడిగినప్పుడే విదేశాంగ మంత్రి జై శంకర్ పై విధంగా స్పందించారు. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
today-latest-news-in-telugu | jai-shankar | usa | trump | India Tariffs
Also Read: Cinema: రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో చియాన్ విక్రమ్?