/rtv/media/media_files/2025/11/19/10-members-missing-from-al-falah-university-2025-11-19-18-00-04.jpg)
10 members missing from Al Falah University
ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత హర్యానాలోని అల్‌ఫలా యూనివర్సిటీ(AL FALAH UNIVERSITY) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ యూనివర్సిటీకి చెందిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఈ ఉగ్ర నెట్‌వర్క్ కేసుకు సంబంధించి అధికారులు మరింత దృష్టి సారించారు. అయితే అల్‌ఫలా యూనివర్సిటీకి చెందిన 10 మంది కనిపించకుండా పోయారని నిఘా వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కనిపించకుండా పోయిన వ్యక్తుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయని.. వీళ్లలో ముగ్గురు కశ్మీరీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఇండియాలో భారీ దాడులకు జైషే కుట్ర.. ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ
10 Members Missing From Al Falah University
ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించిన ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌తో వీళ్లకు కూడా సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని ఓ కారులో బాంబు పేలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్ర నెట్‌వర్క్‌కి చెందిన ఉమర్ అనే వ్యక్తి కూడా ఆ కారులోనే మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి అల్‌ఫలా యూనివర్సిటీకి చెందిన ముగ్గురు వైద్యులతో సహా 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: శబరిమల ఆలయంలో అపశృతి.. ఆలయంలో భక్తురాలు మృతి!
అంతేకాదు అల్‌ఫలా యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంతో సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈడీ మంగళవారం సోదాలు నిర్వహించింది. ఆ వర్సిటీ గ్రూప్ ఛైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దిఖీని కూడా అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు అక్రిడిటేషన్‌తో విద్యార్థుల నుంచి రూ.415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. మరోవైపు ఆ యూనివర్సిటీకి సభ్యత్వాన్ని కూడా భారత విశ్వవిద్యాలయాల సంఘం (AIU) రద్దు చేసింది.
Follow Us