PM Modi: పీఎం కిసాన్‌ నిధులు విడుదల..

కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం అందిస్తున్న పీఎం కిసాన్‌ నిధులు విడుదలయ్యాయి. తమిళనాడులోని కొయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీటిని ప్రధాని మోదీ విడుదల చేశారు.

New Update
PM Modi Releases Rs 18,000 Crore To Nearly 9 Crore Farmers

PM Modi Releases Rs 18,000 Crore To Nearly 9 Crore Farmers

కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం అందిస్తున్న పీఎం కిసాన్‌ నిధులు విడుదలయ్యాయి. తమిళనాడులోని కొయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీటిని ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లకు పైగా నిధులు జమకానున్నాయి.  

PM Kisan Yojana Released

Also Read: శబరిమల ఆలయంలో అపశృతి.. ఆలయంలో భక్తురాలు మృతి!

2019, ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు కేంద్రం 20 విడుతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఈ స్కీమ్‌ కింద అర్హులైన రైతులకు ప్రతీ ఏడాది మూడు విడుతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. భూమి వివరాలు పీఎం కిసాన్‌ పోర్టల్‌లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న రైతులకు ఈ స్కీమ్‌ ద్వారా ప్రయోజనాలు అందుతున్నాయి.  

Also Read: భారత్‌కు వచ్చిన లారెన్స్‌ బిష్ణోయ్ సోదరుడు.. ఇతడి గురించి తెలిస్తే..!

Advertisment
తాజా కథనాలు