/rtv/media/media_files/2025/08/21/jaish-e-mohammed-2025-08-21-12-41-49.jpg)
Jaish-e-Mohammed active again in Pakistan
ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అనంతరం భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీఐకేలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అవి జైష్- ఎ- మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రసంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. మళ్లీ జెష్ ఎ మహమ్మద్ తమ ఉగ్రస్థావరాలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ వ్యాప్తంగా 313 కొత్త ఉగ్ర సంస్థలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
Also Read: లవర్ కోసం 100 కిలోమీటర్లు వెళ్తే.. తెల్లార్లు నరకం చూపించారు..! వీడియో వైరల్
ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం.. అక్కడ కొత్తగా జైషే ఎ మహమ్మద్ సంస్థలో చేరే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు, సురక్షితమైన ఆశ్రయం కల్పించేందుకు ఈ స్థావరాలను వినియోగించనున్నారు. అలాగే ఈ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్, అతడి కుటుంబానికి కూడా ఈ స్థావరాలు సురక్షిత ప్రాంతాలుగా ఉంటాయి. అయితే ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ ఉగ్ర సంస్థ 3.91 బిలియన్ పాకిస్తానీ రూపాయాలను సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: రష్యా..భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి.. జైశంకర్ స్ట్రాంగ్ మెసేజ్
ఈ నిధులు సేకరించేందుకు మసూద్ అజర్, అతడి సోదరుడు తల్హా అల్ సైఫ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నిధులు సేకరించేందుకు ఈజీ పైసా, సదాపే వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగించాలని ఆ సంస్థ ప్లాన్ వేసింది. జైషే కమాండర్లు శుక్రవారం మసీదులలో ప్రార్థనల సమయంలో విరాళాలు సేకరిస్తున్నారు. గాజాలో మానవతా సాయం పేరుతో ఈ విరాళాలు సేకరిస్తున్నారు. కానీ వాటిని ఉగ్ర కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు.
Also Read: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ
జైష్ ఎ మహమ్మద్‌తో లింక్ అయిన విరాళాల రసీదు కాపీ కూడా కనుగొన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 3.94 బిలియన్ల పాకిస్తానీ రూపాయలు పాక్ డిజిటల్ వాలెట్లను వెళ్తున్నట్లు దర్యాప్తులో ఆధారాలు కూడా దొరికాయి. సదాపే అకౌంట్ మసూద్ అజార్ సోదరుడు తల్హా అల్ సైఫ్ (తల్హా గుల్జార్) పేరు మీద ఉంది. ఇది పాక్ మెబైల్ నెంబర్ +92 3025xxxx56 కు లింక్ చేయబడింది. అయితే ఈ నెంబర్ జైష్ ఎ మహమ్మద్ హరిపూర్ జిల్లా కమాండర్ అఫ్తాబ్ అహ్మద్ పేరు మీద రిజిస్టర్ అయ్యంది. మొత్తానికి ఆ ఉగ్రసంస్థకు భారీగా నిధులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జైష్ ఎ మహమ్మద్ కార్యకలాపాలు భారత్‌కు మరో కొత్త సవాలుగా మారనుంది. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత ప్రభుత్వం సైన్యాన్ని మరింత కట్టుదిట్టం చేసింది.
Also Read: ఎక్కడైనా ఫ్రెండే కానీ ఆంక్షల దగ్గర కాదు..రష్యా విమానాలకు ఇంధనం ఇవ్వని అమెరికా