/rtv/media/media_files/2025/08/21/jai-shankar-2025-08-21-10-24-09.jpg)
N. Jai shankar
రష్యా నుంచి చమురు దిగుమతిపై అమెరికా ఆంక్షలు విధించింది. తమ మాట వినలేదని అధిక సుంకాలను విధించింది. ఈ నేపథ్యంలో రష్యాలో పర్యటిస్తున్న బారత విదేశాంగ మంత్రి ఎన్.జైశంకర్ రష్యాకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. బౌగోళిక రాజకీయ సవాళ్ళను ఎదుర్కోవాలంటే రెండు దేశాలు మరింత ఎక్కువ వాణిజ్యం చేయాలని పిలుపునిచ్చారు. భారత్ లో రష్యా వ్యాపారులు మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీని ద్వారా వ్యాపారాన్ని మరింత విస్త్రత పరచుకోవాలని చెప్పారు. అమెరికాను ఢీకొట్టడానికి ఇదొక్కటే సరైన మార్గమని జైశంకర్ అన్నారు.ఇరు దేశాలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్, రష్యా ప్రత్యేక రాయబారి బబుష్కిన్ తో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, టెక్నాలజీ, రక్షణ , సాంకేతిక అంశాలపై చర్చించారు. ఈ ఏడాది చివరల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్ల గురించి కూడా చర్చించుకున్నారు.
At the 26th Session of the India-Russia Inter-Governmental Commission for Trade, Economic, Scientific, Technological, and Cultural Cooperation (IRIGC-TEC), EAM Dr S Jaishankar says "We are meeting here after about 10 months since the last Session in November 2024 in New Delhi,… pic.twitter.com/62lIpuS69l
— ANI (@ANI) August 20, 2025
మా దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి..
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ..అంతే కాకుండా మేక్ ఇన్ ఇండియాతో విదేశీ వ్యాపారాలకు కూడా తలుపులు తెరిచామని జైశంకర్ చెప్పారు. వీటిని రష్యా గమనించి తమతో వ్యాపారం చేయాలని చెప్పారు. భవిష్యత్తులో 4 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ 7% వృద్ధి చెందుతున్న GDP ఉన్న భారతదేశానికి విశ్వసనీయ వనరుల నుండి పెద్ద వనరుల అవసరం ఉందని...దానికి రష్యా సరైన ఎంపికని అన్నారు. దీని కోసం రష్యన్ కంపెనీలో భారత్ లో మరింత పెట్టుబడులు పెట్టాలని సూచించారు. టారిఫ్ మరియు నాన్-టారిఫ్ అడ్డంకులు, లాజిస్టిక్స్‌లో అడ్డంకులను తొలగించడం, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్, ఉత్తర సముద్ర మార్గం మరియు చెన్నై-వ్లాడివోస్టాక్ కారిడార్ ద్వారా కనెక్టివిటీని ప్రోత్సహించడం మరియు సజావుగా చెల్లింపు విధానాలను నిర్ధారించడం. ఇవే ప్రధాన సమస్యలని...వీటిని తొందరగా పరిష్కరించుకోవాలని జైశంకర్ అన్నారు. మాస్కో సమావేశంలో కమిషన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం నిబంధనలను ఖరారు చేసిందని ఆయన ధృవీకరించారు. వాణిజ్యాభివృద్ధికి ఇదొక కీలకమైన అడుగని అభివర్ణించారు.
గత నాలుగేళ్ళల్లో భారత్, రష్యాల మశ్య వాణిజ్యం పెరిగినప్పటికీ ఇంకా అసమతుల్యతలు ఉన్నాయని జైశంకర్ అన్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపారం 2021లో 13 డాలర్ల బిలియన్ల నుండి 2024-25లో 68 డాలర్ల బిలియన్లకు పెరిగింది. రాబోయే ఐదేళ్ళల్లో ఇది 700శాతం పెరుగుతుందని అంచనా. కానీ 2021లో రష్యాతో భారతదేశ వాణిజ్య లోటు కేవలం 6.6 బిలియన్ డాలర్లు.. ఇది ఇప్పటికి దాదాపు 59 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే ఇంకా ఇది సరిపోదు. దీనిని పరిష్కరించాలంటే మాస్కో తన మార్కెట్‌ను భారత ఎగుమతుల కోసం విస్తృతంగా తెరవాలని జైశంకర్ కోరారు. అమెరికా విధించిన టారీఫ్ ల నేపథ్యంలోనే ఈ చర్చలు జరిగుతున్నాయని జైశంకర్ తెలిపారు.
Also Read: India-Nepal: సరిహద్దు వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన భారత్