Alaska Meet: ఎక్కడైనా ఫ్రెండే కానీ ఆంక్షల దగ్గర కాదు..రష్యా విమానాలకు ఇంధనం ఇవ్వని అమెరికా

అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు రెడ్ కార్పెట్ గౌరవం దక్కింది. కానీ ఆయన ప్రతినిధి బృందం మాత్రం తమ జెట్ లలో ఇంధనం నింపుకోవడానికి ఏకంగా రూ.2. 2 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీనికి కారణం ఆ దేశంపై ఉన్న ఆంక్షలే అని చెబుతున్నారు మార్కూ రూబియో.

New Update
alaska meet

Alaska Meet

భేటీకి ముందంతా అది చేస్తాం ఇది చేస్తాం అని బీరాలు పలికారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పుతిన్ తన మాట వినకపోతే ఆంక్షలతో దండెత్తుతామని బెదిరించారు. తీరా అలస్కాలో సమావేశం జరిగిన రోజు మాత్రం ట్రంప్ అదేమీ లేనట్టు వ్యవహరించారు. పూర్తిగా రష్యా అధ్యక్షుడికి తలొగ్గినట్టు కనిపించారు. ఆయన ఏం చెప్పినా తలాడించారు. అసలు ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడకపోయినా నోరు మెదపలేదు. పైగా పుతిన్ కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. బీ2 బాబంర్లు, ఫైటర్ జెట్లతో తమ సైన్యం బలుపును ట్రంప్ చూపించినప్పటికీ మొత్తం సమావేశంలో పై చెయ్యి పుతిన్ దే అయింది. పైకి తాము గొప్ప పురోగతి సాధించామని ట్రంప్ చెప్పినప్పటికీ అసలు విషయం మాత్రం మాట్లాడనివ్వలేదు రష్యా అధ్యక్షుడు పుతిన్. 

యుద్ధం విరమించే వరకూ ఆంక్షలు తప్పవు..

ఆ సంగతి అలా ఉంచితే పుతిన్ ప్రతినిధి బృందం మాత్రం అలస్కాలో తమ జెట్లకు ఇంధనం నింపుకోవడానికి బోలెడంత డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. అలా ఎందుకని అడిగితే...తమ్ముడు తమ్ముడే...పేకాట పేకటా అని చెప్పారు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కూ రూబియో.  రష్యాపై అమెరికా ఆంక్షలు విధించిందని...దాని ప్రకారం వారి బ్యాంకు లావాదేవీలు చెల్లవని చెప్పారు. రష్యా ప్రతినిధి బృందం యూఎస్ బ్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగించుకోలేనందున వారు తమ విమానాలకు ఇంధనం నింపుకోవడానికి నగదు చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. దీని కోసం వారు రూ. ఏకంగా 2.2 కోట్ల డబ్బును చెల్లించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు తీసుకున్న రోజున సంతకం పెట్టిన ఆర్డర్లు ఇంకా అమల్లోనే ఉన్నాయని మార్కూ రూబియో తెలిపారు. పుతిన్ కు ఎంత గౌరవం ఇచ్చినా ఆంక్షల విషయంలో మాత్రం తగ్గేదే లేదు అని చెప్పుకొచ్చారు. యుద్ధాన్ని ఆపేంత వరకూ అవి తప్పవని అన్నారు. అయితే కొత్త ఆంక్షలు మాత్రం ఉండవని స్పష్టం చేశారు. కొత్తవి ఏమైనా పెడితే పుతిన్ ఊరుకునేలా లేరని అన్నారు. 

 రష్యా అధ్యక్షుడు పుతిన్ బృందం దాదాపు ఐదు గంటల పాటూ అలస్కాలో ఉంది. పుతిన్, ట్రంప్ లమధ్య సమావేశం రెండున్నర గంటలపాటూ జరిగింది. దాని తరువాత మీడియా బ్రీఫింగ్ కొంత సేపు అయింది. ఇందులో గొప్ప పురోగతి సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. కానీ యుద్ధ విరమణపై ఇటు పుతిన్, అటు ట్రంప్ ఇద్దరూ మాట్లాడలేదు. దీని తరువాత మూడు రోజులకు వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, యూరోపియన్ అధినేతలతో సమావేశమయ్యారు. ఇందులో యుద్ధ విరమణ గురించి చర్చించారు. జెలెన్ తాను శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరోవైపు పుతిన్, జెలెన్, తాను కలిపి త్రైపాక్షిక సమావేశం త్వరలోనే ఉంటుందని...యుద్ధ విరమణ దిశగా అడుగులు పడ్డాయని చెప్పారు. 

Also Read: Crude Oil: నువ్వేం పీకలేవు ట్రంప్ అంటున్న రష్యా, భారత్..సుంకాల తర్వాత చమురుపై 5 శాతం డిస్కౌంట్

Advertisment
తాజా కథనాలు