/rtv/media/media_files/2025/08/21/viral-video-2025-08-21-10-45-35.jpg)
viral video
Viral Video: 1 కాదు 10 కాదు.. లవర్ ని కలవడానికి ఏకంగా 100 కిలోమీటర్లు నడిచివెళ్ళాడు ఓ యువకుడు. కానీ, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అతడికి భయానక అనుభవం ఎదురైంది. అమ్మాయి కుటుంబ సభ్యులు అతడిని చెట్టుకు కట్టేసి 13 గంటల పాటు చితకబాదారు. అంతేకాదు ఈ దాడికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాత్రంతా నరకం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే రేవా జిల్లాలలోని బైకుంఠ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిగా కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ యువకుడు.. ఆమెను కలవడానికి 100 కిలోమీటర్లు ప్రయాణించి మౌగంజ్ జిల్లాలోని పిప్రాహి గ్రామానికి వచ్చాడు. ఈ విషయం కాస్త కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆ యువకుడిని చితకబాదారు. కాళ్ళు, చేతులను తాడుతో కట్టేసి తీవ్రంగా కొట్టారు. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం 10 గంటల వరకు మొత్తం 13 గంటల పాటు అతడిని కొడుతూనే ఉన్నారు.
అంతేకాదు కొడుతున్న వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కుటుంబ సభ్యులు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో స్థానిక పోలీసులు స్పందించారు. ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు. అయినప్పటికీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏదేమైనా ఆ యువకుడిని అలా 13 గంటలపాటు హింసించడం నెటిజన్లను ఆందోళనకు గురిచేసింది.
Also Read: Venu Swamy: వేణుస్వామిని గుడి నుంచి తరిమేసిన అర్చకులు.. కామాఖ్యా ఆలయంలో షాకింగ్ ఘటన!