Jagdeep Dhankhar: మోదీకి షాకిచ్చిన ధన్‌ఖడ్‌.. ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారంలో ప్రత్యక్షం

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ ఏడాది జులై 21న తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన మళ్లీ ఇంకా ఎక్కడా కనిపించలేదు. తాజాగా సీపీ రాధకృష్ణన్‌ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికే ఆయన హాజరయ్యారు.

New Update
Jagdeep Dhankhar's First Public Appearance Since Exit

Jagdeep Dhankhar's First Public Appearance Since Exit

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌(jagdeep-dhankhar) ఈ ఏడాది జులై 21న తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన మళ్లీ ఇంకా ఎక్కడా కనపించలేదు. ఆయన ఆరోగ్యంపై కూడా అనేక రూమర్స్ వచ్చాయి. సరిగ్గా 52 రోజుల తర్వాత జగదీప్‌ ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించారు. సీపీ రాధకృష్ణన్‌ ఉపరాష్ట్రపతిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికే జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ హాజరయ్యారు. ఆయన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో మాట్లాడుతూ కనిపించారు. అలాగే రాధాకృష్ణన్‌ను అభినందిస్తున్నప్పుడు నవ్వుతూ కనిపించారు.

Also Read: హిజ్రా మనసు దోచుకున్న యువకుడు.. పెళ్లితో ఒక్కటైన జంట

Jagdeep Dhankhar Gave Shock To PM Modi

జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేసినప్పటి నుంచి బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లుగా ఆయన ఇతర కార్యక్రమాలు, మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేసింది. కావాలనే ఆయన్ని పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు చేసింది. అనారోగ్య కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖడ్‌ ప్రకటించారు. కానీ నోట్ల కట్టల కేసుకు సంబంధించి జస్టిస్‌ యశ్వంత్‌వర్మ అభిశంసన వ్యవహారంలో కేంద్రంతో ఆయనకు విభేదాలు రావడం వల్లే వైదొలగినట్లు విపక్షాలు ఆరోపించాయి. 

Also read: ఎలోన్ మస్క్ నంబర్ వన్ స్థానాన్ని లాగేసుకున్న 81 ఏళ్ళ వ్యక్తి..అతనెవరో తెలుసా?

అయితే శుక్రవారం సీపీ రాధకృష్ణన్‌(cp-radha-krishnana) ప్రమాణ స్వీకారానికి హాజరైన ధన్‌ఖడ్‌ అందిరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ధన్‌ఖడ్‌ వెంకయ్య నాయుడితో ఏదో చెవిలో చెబుతూ కనిపించారు. వాళ్లేం మాట్లాడుకున్నారనేది క్లారిటీ లేదు. 

Also Read: ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం-PHOTOS

Advertisment
తాజా కథనాలు