New World Richest: ఎలోన్ మస్క్ నంబర్ వన్ స్థానాన్ని లాగేసుకున్న 81 ఏళ్ళ వ్యక్తి..అతనెవరో తెలుసా?

ప్రపంచ ధనంతుడు ఎలోన్ మస్క్...ఇది నిన్నటి వరకు. ఇప్పుడు ఈ స్థానాన్ని లారీ ఎల్లిసన్ అనే 81 ఏళ్ళ వ్యక్తి సొంతం చేసుకున్నారు. లారీ ఎల్లిసన్ నికర విలువ 393 బిలియన్ డాలర్లు ఉండగా ఎలాన్ మస్క్ నికర విలువ 385 బిలియన్ డాలర్లుగా ఉంది.

New Update
larry

Larry Ellison-Elon Musk

ఎక్స్(X) దిగిపోయింది..టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్(Oracle Corporation) పైకెగిసింది. దీంతో టెక్ అధిపతి ఎలోన్ మస్క్(Elon Musk) ప్రపంచ కుబేరుడు కిరీటాన్ని కోల్పోయారు. ప్రపంచ నంబర్ వన్ ధనవంతుడిగా 81 ఏళ్ళ లారీ ఎల్లిసన్ అవతరించారు. దాదాపు 101 బిలయన్ డాలర్ల సంపదతో ఎలోన్ మస్క్ ను తోసిరాజన్నారు. ఇంతా కేవలం ఒక్క రోజులోనే జరగడం ఇక్కడ విశేషం. ఎన్నో ఏళ్ళుగా తన స్థానాన్ని పదిలపర్చుకుంటూ వచ్చిన మస్క్ ఒక్క రోజులోనే కిందకు దిగిపోయారు. లారీ ఎల్లిసన్ సంపద విలువ హఠాత్తుగా వన్ డే లోనే 100 బిలయ్లకు పైగా పెరిగింది.

పైకెగిసిన ఒరాకిల్..పడిపోయిన టెస్లా..

లారీ ఎల్లిసన్...టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ సహా వ్యవస్థాపకుడు. ప్రసతుతం ఈయన ఒరాకిల్ ఛైర్మన్గా, చీఫ్ టెక్నాలీ ఆఫీసర్ గా ఉన్నారు. ఈ కంపెనీ నిన్న తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఇందులో తమ సంపద పెరిగినట్టు చూపించింది. దీంతో లారీ ప్రపంచ ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ఆకస్మిక జంప్ కారణంగా.. న్యూయార్క్‌లో ఉదయం 10:10 గంటలకు ఎల్లిసన్ సంపద $393 బిలియన్లకు చేరుకుంది. దీనితో అతను ఎలోన్ మస్క్‌ను అధిగమించి నంబర్ 1 ధనవంతుడు అయ్యాడు. ఎలోన్ మస్క్ నికర విలువ $385 బిలియన్లుగా నమోదైంది. ఒకే రోజులో ఏ బిలియనీర్ సంపదలోనూ ఇది అతిపెద్ద జంప్ రాలేదని బ్లూమ్ బర్గ్ చెబుతోంది. ఈ ఏడాది ఒరాకిల్ పెర్ఫామెన్స్ గనణీయంగా పెరిగింది. ఈ కంపెనీ స్టాక్స్ కూడా బలమైన పెరుగుదలను నమోదు చేశాయి. స్టాక్స్ వాల్యూ 45% కంటే ఎక్కువ పెరిగాయి. మంగళవారం ఎల్లిసన్ స్టాక్ $241.63 వద్ద ముగిసింది. కానీ బుధవారం అది $319.19 వద్ద తుఫాను వేగంతో పెరిగింది. చివరకు $345.72 దగ్గర ముగిసింది. మరోవైపు గత కొన్ని రోజులుగా టెస్లా పడిపోవడం, దాని షేర్లు కూడా పతనం అవ్వడంతో ఎలాన్ మస్క్ నికర విలువ బాగా తగ్గిపోయింది. ఈ కారణంగానే అతను నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయారు.

Also Read :  నేపాల్‌లో దారుణం.. హోటల్‌కు నిప్పు, భారతీయ మహిళ మృతి

Also Read: Nepo Kids: నేపాల్లో జెన్ జీ ఉద్యమానికి కారణమైన నెపో కిడ్స్..వారి సోషల్ మీడియా పోస్ట్ లు

Advertisment
తాజా కథనాలు