Hijra: హిజ్రా మనసు దోచుకున్న యువకుడు.. పెళ్లితో ఒక్కటైన జంట

ఓ యువకుడు హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

New Update
A young man married a Hijra woman in Tamil Nadu

A young man married a Hijra woman in Tamil Nadu

''ప్రేమంటే సులువు కాదురా.. అది నీవు గెలవలేవురా'' అనే సాంగ్ మీరు ఖుషీ మూవీ(Kushi Movie) లో చూసే ఉంటారు. ఆ పాటలో ప్రేమ అందరికీ దొరకదని హీరోయిన్‌ అంటుంది. వాస్తవానికి ప్రేమించిన అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకునే అవకాశం కొందరికే ఉంటుంది. చాలామంది ప్రేమ పెళ్లిల్లు చేసుకోవడంలో విఫలమవుతారు. అయితే ఓ యువకుడు మాత్రం ఏకంగా హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడులో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

Also Read: నేపాల్లో జెన్ జీ ఉద్యమానికి కారణమైన నెపో కిడ్స్..వారి సోషల్ మీడియా పోస్ట్ లు

Young Man Married Hijra

ఇక వివరాల్లోకి వెళ్తే.. సేలం జిల్లాలో ఓమలూర్‌లో శరవణ కుమార్‌(32) అనే వ్యక్తి ఉన్నాడు. అతడు స్థానికంగా ఉన్న వస్త్ర తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో సరోవ(30) అనే హిజ్రా(Hijra) పనిచేస్తోంది. ఈ క్రమంలోనే శరవణ కుమార్‌ ఆమెపై మనసు పారేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె కూడా అంగీకరించింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి(Young Man Married Hijra) చేసుకునేందుకు సిద్ధమయ్యారు.పెద్దలకు ఈ విషయం చెప్పి ఒప్పంచారు. చివరికి వాళ్లు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. 

Also Read: భారత్, అమెరికాలు త్వరలోనే కలిసిపోతాయి..అమెరికా రాయబారి సెర్గియో గోర్

ఈ క్రమంలోనే గోపిచెట్టిపాలయంలోని పెరియర్ అనే కళ్యాణ మండపంలో ఈ జంట మూడుమూళ్లతో ఒక్కటయ్యారు(Love Marriage). వీళ్ల వివాహానికి ద్రావిడ కళగం జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది మునియప్పన్‌ నేతృత్వం వహించారు. శరవణ కుమార్, సరోవ ప్రేమ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Also Read: భారత్, అమెరికాలు త్వరలోనే కలిసిపోతాయి..అమెరికా రాయబారి సెర్గియో గోర్

Advertisment
తాజా కథనాలు