/rtv/media/media_files/2025/01/13/BVOlRD2EP28M7zdI183V.jpg)
Infosys
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో పనిచేసేవారికి గుడ్‌న్యూస్. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉద్యోగులకు కూడా త్వరలోనే ఈ సమాచారం అందనున్నట్లు సమాచారం. ఇన్ఫోసిస్‌లో వేతనాల పెంపునకు సంబంధించి జాతీయ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.
Also Read: అసలు మనిషేనా వీడు.. గిరిజన విద్యార్థినులు చేత టాయిలెట్లు కడిగించాడు!
మొదటగా జాబ్ లెవల్ 5(JL5)లో ఉన్న ఉద్యోగులకు వేతనాల పెంపు ఉంటుందని సమాచారం. ఫిబ్రవరిలో దీనికి సంబంధించి ఉత్తరాలు కూడా జరీ చేయనున్నారు. జనవరి 1 నుంచి ఈ జీతాల పెంపు అమల్లోకి వస్తోందని తెలుస్తోంది. అయితే జాబ్ లెవల్ 5లో చూసుకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సీనియర్ ఇంజినీర్లు, సిస్టమ్ ఇంజినీర్లు అలాగే కన్సల్టెంట్లు కూడా ఉంటారు.
జాబ్ లెవల్ 6 కన్నా ఎక్కువ ఉన్నవారికి వేతనాల పెంపునకు సంబంధించి మార్చిలో ఉత్తరాలు అందుతాయని సమాచారం. అయితే వీళ్లకి ఏప్రిల్ నుంచి పెంపు వర్తిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా జీతాల పెంపునకు సంబంధించి ఇన్ఫోసిస్ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు వేచిచూస్తున్నారు.
Also Read: దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ
నగదు ఆదా చేసేందుకు 2021-22 ఆర్థిక ఏడాదిలో ఇన్ఫోసిస్ వేతన పెంపును స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2023లో వార్షిక అప్రైజల్ సైకిల్‌ను ప్రారంభించారు. ఇక చివరిసారిగా 2023 నవంబర్ 1న ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు అమల్లోకి వచ్చింది. ఇది 2022 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు సంబంధించిన అప్రైజల్ పీరియడ్. 2023 డిసెంబర్‌లో ఉద్యోగులకు రేటింగ్ లెటర్స్‌ను అందజేశారు. అయితే మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగాల పెంపు అమల్లోకి రానుంది.