Bank Employees : 17శాతం జీతాల పెంపు.. వారానికి 5రోజులే పని
బ్యాంకు ఉద్యోగులకు అదిరిపోయే వార్త చెప్పింది ఐబీఏ. బ్యాంకు ఉద్యోగులకు భారీగా జీతాలు పెరగడంతో పాటూ ఇక మీదట వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండనున్నాయి. ఈ మేరకు భారతీయ బ్యాంకుల సమాఖ్య, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది.