దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ

తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై ఓ గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కరణ విధించడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
caste discrimination

caste discrimination

సాంకేతికత రోజురోజుకు పెరుగుతున్నా కొందరు దుర్మార్గాలు మాత్రం కుల వివక్షను వీడటం లేదు. కులాల మధ్య అంతరాలు తీసుకొస్తూ.. పాతకాలం నాటి విధానాలు పాటిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై ఓ గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కరణ విధించడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.   

Also Read: మంత్రి పొంగులేటి తప్పిన పెను ముప్పు.. పేలిన కారు టైర్లు!

ఇక వివరాల్లోకి వెళ్తే.. అత్రార్ గ్రామంలో ఓ దళిత వర్గానికి చెందిన వ్యక్తి తన మొక్కు నెరవేరిందని ఆ ఊరిలోని హనుమాన్ టెంపుల్‌కి వచ్చాడు. మొక్కు చెల్లించుకున్నాడు. ఆ తర్వాత ఆలయానికి వచ్చిన భక్తులకు లడ్డులు ప్రసాదంగా ఇచ్చాడు. అయితే ఆ ప్రసాదాన్ని ఆ గ్రామంలో ఉన్న బ్రాహ్మణులు సహా ఇతర వర్గాలకు చెందిన 20 కుటుంబాల వాళ్లు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ లడ్డూ ప్రసాదం తిన్న 20 మంది కుటుంబాలపై సామాజిక బహిష్కరణ విధించాడు. 

Also Read: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్‌లు.. లిస్ట్ ఇదే!

వీళ్లు గ్రామంలో జరిగే వివహాలు ఇతర ఏ కార్యక్రమాలు జరిగినా హాజరుకావద్దని ఆదేశించాడు. దీంతో బహిష్కరణకు గురైన బాధితులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ ఆగం జైన్ మాట్లాడారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్నామని.. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 

Also Read: ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామం.. బరిలోకి దిగనున్న ఎన్సీపీ

Also Read: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు