డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు.. బంపర్ ఆఫర్‌ ప్రకటించిన కంపెనీ

జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

New Update
Sridhar Vembu says degrees aren’t mandatory at Zoho

Sridhar Vembu says degrees aren’t mandatory at Zoho

డిగ్రీ ఉంటేనే మంచి జాబ్ వస్తుందని అందరూ చెబుతుంటారు. ప్రస్తుతం అనేక కంపెనీలు కూడా డిగ్రీలు చేసిన వాళ్లకే ఉద్యోగాలు ఇస్తున్నాయి. దశాబ్దాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే దీనికి భిన్నంగా జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. '' మా కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలపై పేరెంట్స్‌ డిగ్రీలు చదవాలని ఒత్తిడి చేయొద్దు. 

Also read: పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు సంచలన ప్రకటన

ప్రస్తుతం అమెరికా తెలివైన విద్యార్థులు కళాశాలకు వెళ్లడం మానేస్తున్నారు. ముందుచూపు కలిగిన కంపెనీలు వాళ్లకి ఉద్యోగావకాశాలు ఇస్తున్నాయి. ఒక కాగితం కన్నా ప్రతిభ, ఉత్సుకత అనేదే చాలా ముఖ్యం. డిగ్రీల కోసం అప్పులు చేసే బదులు ఆచరణాత్మక సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల యువతకు ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది. ఇలాంటి మార్పును తల్లిదండ్రులు అర్థం చేసుకుని పిల్లలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునేలా సపోర్ట్ చేయాలని'' శ్రీధర్ వెంబు రాసుకొచ్చారు. ఇండియాలో కూడా ఇలాంటి ఆలోచనా విధానం ఉండాలని.. ఉద్యోగంలోనే నేర్చుకునేలా జోహో లాంటి కంపెనీలు అవకాశం ఇస్తున్నాయని  ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Also Read: భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ

జోహా కార్పొరేషన్ అనేది క్లౌడ్ ఆధారిత బిజినెస్‌ సాఫ్ట్‌వేర్. ఈ కంపెనీ కో ఫౌండర్‌ అయిన శ్రీధర్ వెంబు ఈ సంస్థకు సీఈవోగా పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన ఈ బాధ్యతల నుంచి తప్పుకొని కంపెనీ చీఫ్‌ సైంటిస్ట్‌గా నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆయన పరిశోధన, కంపెనీ అభివృద్ధిపై దృష్టి సారించారు. 

Advertisment
తాజా కథనాలు