/rtv/media/media_files/2025/05/02/3OEjjmxvKZ7i1kRLsphm.jpg)
Prabhas Spirit Latest Update
Prabhas Spirit Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అలాగే డార్లింగ్ లైన్-అప్ కూడా మాములుగా లేదు సలార్ 2, కల్కి 2, స్పిరిట్, అలాగే దర్శకుడు ప్రసాంత్ వర్మతో చేయబోయే ఓ కొత్త ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. అయితే వీటిలో స్పిరిట్ పై మాత్రం ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి, ఎందుకంటే "యానిమల్" వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించడం.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్..!
భూషణ్ కుమార్ కీలక అప్డేట్..
ఇటీవల నిర్మాత భూషణ్ కుమార్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్‌పై కొన్ని కీలక అప్డేట్స్ వైరల్ గ మారాయి. స్పిరిట్ మూవీ షూటింగ్ ఇంకో 2-3 నెలల్లో ప్రారంభమవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్. అంతేకాకుండా, 'యానిమల్ పార్క్' షూటింగ్ కూడా 'స్పిరిట్' సినిమా విడుదలైన తరువాతే మొదలవుతుందని స్పష్టం చేశారు.
#BhushanKumar drops a big update about #Prabhas’ #Spirit -
— MOHIT_R.C (@Mohit_RC_91) May 2, 2025
In a recent interview, one of the producers, Bhushan Kumar revealed that the biggie will go on floors in the next 2-3 months. Bhushan Kumar made it clear that #AnimalPark will start only after Spirit’s release. pic.twitter.com/w8670cNFUN
ఇదిలా ఉండగా, సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే స్పిరిట్ స్క్రిప్ట్‌ను పూర్తిచేశారని, ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా కలిసి నిర్మిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా చేపట్టనున్నాయి. మ్యూజిక్ ఆర్జీవీ సినిమాల్లో తన టాలెంట్‌ను నిరూపించుకున్న హర్షవర్ధన్ రమేశ్వర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ అభిమానులకు ఇది పక్కా ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతోందన్న అంచనాలు ఉన్నాయి. స్టోరీ, డైరెక్షన్ ఇలా అన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో స్పిరిట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.