VIRAL VIDEO: భారతీయుడికి ఐర్లాండ్‌లో ఘోర అవమానం.. బట్టలు చించి, చిత్రహింసలు

ఐర్లాండ్ రాజధానిలో భారతీయడికి ఘోర అవమానం జరిగింది. కొందరు యువకులు జాతివివక్షతో దాడికి పాల్పడ్డారు. 40 ఏళ్ల భారతీయ పౌరుడిని దుండగులు బట్టలు చించి, తీవ్రంగా హింసించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం ఖండించింది.

New Update
RACIST

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని తల్లాట్ ప్రాంతంలో భారతీయడికి ఘోర అవమానం జరిగింది. దారుణంగా జాతివివక్ష దాడికి పాల్పడ్డారు. 40 ఏళ్ల భారతీయ పౌరుడిని దుండగులు బట్టలు చించి, తీవ్రంగా హింసించారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం ఖండించింది.

జూలై 19 సాయంత్రం తల్లాట్లో ఈ దారుణం జరిగింది. కొద్దిమంది యువకులు భారతీయుడిపై దాడి చేసి, అతడిని దారుణంగా కొట్టి, అతడి దుస్తులను తొలగించారు. బాధితుడి ఛాతీ, చేతులు, కాళ్ళకు తీవ్ర గాయాలై రక్తస్రావం అయింది. ఈ దాడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

Also Read :  నాగర్ కర్నూలు జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

Indian Man Attacked In Ireland

Also Read :  మళ్లీ పరువు తీసుకున్న పాకిస్తాన్.. సొంత దేశంలోనే కూలిన క్షిపణి.. దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు

Also Read :  వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించండి.. హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు!

దాడికి గురైన వ్యక్తి పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే తప్పుడు ఆరోపణలు చేసినట్లు నిందితులు పేర్కొన్నారు. అయితే, ఐరిష్ పోలీసులు ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనను జాతివివక్ష నేరంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన జరిగిన వెంటనే బాధితుడిని తల్లాట్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన షాక్‌లో ఉన్నారని, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారని స్థానిక కౌన్సిలర్ బేబీ పెరెప్పాడన్ తెలిపారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా డిమాండ్ చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు, అయితే ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు జరగలేదు. దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read :  జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా అందుకేనా?

atest-telugu-news | Viral Video | ireland | racist gang | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు