/rtv/media/media_files/2025/05/05/Ry6fCEJrAqNuiyIMjsXZ.jpg)
Indian Army
ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. దీంతో కశ్మీర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికతో గాలింపు చర్యలు వేగవంతం చేసింది. అయితే దక్షిణ కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో కశ్మీర్ అడవులను ఇండియన్ ఆర్మీ చుట్టిముట్టింది.
Also Read: వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!
సురాన్‌కోట్ అడవుల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రదాడి కుట్రను కూడా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పూంచ్‌లో ఐఈడీ పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి. 5 ఐఈడీలు, కమ్యూనికేషన్ పరికరాలను సీజ్ చేశారు. అయితే భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులు జరిగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్, కుప్వారా, బారాముల్లా ప్రాంతాల్లో పాకిస్థాన్ ఈ దాడులు జరిగాయి. దీంతో వెంటనే స్పందించిన భారత భద్రతా బలగాలు పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్‌ను తిప్పికొట్టాయి. దీంతో బార్డర్‌లో భారత సైన్యం మరింత మోహరించింది. కొత్తగా మరో 16 అదనపు బెటాలియన్లను రంగంలోకి దిగాయి.
పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా భద్రతను మరింత బలోపేతం చేశారు. అయితే పాకిస్థాన్‌పై దాడి చేసేందుకు గాను సైన్యం మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దుల్లో 193 బెటాలియన్లు మోహరించాయి. ఒక్కో బెటాలియన్‌లోనే ఏకంగా వెయ్యి మందికి పైగా సైనికులు ఉన్నారు.
Also Read: కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరో టెర్రరిస్ట్ అరెస్టు
మరోవైపు యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ కాళ్ల బేరానికి దిగింది. యుద్ధ భయంతో ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC) అత్యవసర భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. అయితే ఉద్రిక్తతలపై పాకిస్థాన్ క్లోజ్డ్ కన్సల్టేషన్ కోరింది. భారత్ చర్యలు శాంతి భద్రతలకు హాని కలిగిస్తున్నాయని ఆరోపించింది.
Also Read: వాటిపై ఏకంగా 100% సుంకాలు.. మరో బాంబ్ పేల్చిన ట్రంప్!
Also Read: నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల ముసలవ్వ.. చదువుకు వయసు అడ్డం కాదని నిరూపించింది
rtv-news | india pakistan war