/rtv/media/media_files/2025/09/09/cp-radha-krishnan-2025-09-09-17-41-36.jpg)
ఊహించిందే జరిగింది. ఈ రోజు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నిక(Vice President Election 2025)ల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్(cp-radhakrishnan) భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఈయన 15వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ బ్యాగ్రౌండ్ ఏంటి?, ఎంతో మంది సీనియర్ నేతలు పోటీలో ఉన్నా ఆయనకే బీజేపీ హైకమాండ్ ఎందుకు ఛాన్స్ ఇచ్చింది.. అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. తమిళనాడు(Tamil Nadu) లోని తిరుప్పూర్‌లో మే 4, 1957న ఆయన జన్మించారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఆయన బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 16 ఏళ్ల నుంచి ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా పని చేసిన ఆయన.. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీలో వివిధ హోదాల్లో పని చేసిన రాధాకృష్ణన్ హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు పొందారు. దీంతో 2004లో ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది. 2007 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 1998, 1999 ఎన్నికల్లో ఆయన కోయంబత్తూర్ ఎంపీగా ఆయన విజయం సాధించారు. 2004, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన అదే స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
#WATCH | Delhi: PC Mody, Secretary-General, Rajya Sabha says, "NDA nominee and Maharashtra Governor C.P. Radhakrishnan got 452 first preference votes. He has been elected as the Vice President of India... Opposition's vice-presidential candidate Justice Sudershan Reddy secured… pic.twitter.com/hW7dUY0yfi
— ANI (@ANI) September 9, 2025
Also Read : ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ గ్రాండ్ విక్టరీ.. మెజార్టీ ఎంతంటే?
రాధాకృష్ణ టార్గెట్ గా బాంబు దాడి.. షాకింగ్ విషయాలు..
1998లో కేంద్రంలో పట్టుకోసం బీజేపీ(BJP) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న రోజులు అవి. దక్షిణ భారతదేశం ముఖ్యంగా తమిళనాడు.. పార్టీకి పెద్ద పట్టులేని ప్రాంతం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో సీపీ రాధాకృష్ణన్‌కు కోయంబత్తూర్ సీటు టికెట్ ఇచ్చింది హైకమాండ్. ఆయన ఎన్నికల ప్రచారానికి అప్పటి అగ్ర అద్వానీ వచ్చారు. అప్పుడే ఓ షాకింగ్ సంఘటన జరిగింది. తమిళనాడు చరిత్రలో ఆ రోజు ఓ చీకటి పేజీగా మిగిలిపోయింది.
అప్పటికే బీజేపీకి, ముస్లిం వర్గాలకు ఆ రాష్ట్రంలో గొడవలు బాగా జరుగుతున్నాయి. ఆ ప్రభావం తమిళనాడులోని సీసీ రాధాకృష్ణన్, అద్వానీ ర్యాలీపై పడింది. 1997 ఫిబ్రవర్ 14 మధ్యాహ్నం కొయంబత్తూరులో వీరి ర్యాలీ సమీపంలో బాంబు పేలుళ్లు జరిగాయి. రద్దీగా ఉండే మార్కెట్లు, బస్ స్టేషన్లు, ప్రధాన రహదారులను లక్ష్యంగా చేసుకుని బాంబులను వేశారు. ఈ దాడిలో దాదాపు 58 మంది చనిపోయారు. 200 కు పైగా గాయపడ్డారు. వీటి వెనుక అల్ ఉమ్మా అనే సంస్థ హస్తం ఉందని విచారణలో తేలింది.
ఈ పేలుళ్ల తరువాత తమిళనాడులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. అప్పటికే బాబ్రీ మసీదు గొడవలు నడుస్తున్నాయి. మరోవైపు దేశంలో అద్వానీ నాయకత్వంలో బీజేపీని బలోపేతం చేయాలనే ప్రచారం ఊపందుకుంది. ఈ కారణంగానే కీలక నేతలు అద్వానీ, రాధాకృష్ణన్ లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిపారన్న ప్రచారం జరిగింది. అయితే అద్వానీ, సీపీ రాధాకృష్ణ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
తమిళనాడు బాంబు పేలుళ్ల వెనుక ఎస్ఏ బద్రుద్దీన్, అతని సంస్థ అల్ ఉమ్మా పై ఉన్నారని గుర్తించిన దర్యాప్తు సంస్థలు వారి స్థావరాలపై దాడులు చేశారు. ఈ కేసులో 2007లో 8 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.
కానీ తమిళనాడు బాంబు పేలుళ్లు సీపీ రాధాకృష్ణ కు బాగా కలిసి వచ్చాయన్న చర్చ కూడా ఉంది. ఆ సానుభూతితో అనంతరం ఎన్నికల్లో ఆయన 55.85% ఓట్లు సాధించి అఖండ విజయం సాధించారని చెబుతుంటారు. హిందూ ఓటర్లు అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించారన్న టాక్ కూడా ఉంది. దీంతో బీజేపీ దక్షిణ భారత్ లోకి రావడం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
Also Read : ప్రధాని మోదీ కీలక నిర్ణయం...రూ. 1500 కోట్లు రిలీజ్!