India-US trade deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. రష్యా చమురుకు గుడ్ బై.. అమెరికా ఉత్పత్తులపై ఇకపై నో టారిఫ్‌లు

అమెరికా నుంచి భారత్‌కు వచ్చే సుమారు 99 శాతం వస్తువులపై దిగుమతి పన్నులను భారత్ పూర్తిగా రద్దు చేయనుంది. గతంలో అమెరికా నుండి వచ్చే తయారీ వస్తువులపై సగటున 13.5 శాతం పన్ను ఉండేది. కానీ ఇప్పుడు అది సున్నాకు చేరింది.

New Update
FotoJet (8)

India-US trade deal

భారతదేశం, అమెరికా మధ్య కుదిరిన నూతన వాణిజ్య ఒప్పందం(america trade deal with india) వల్ల రెండు దేశాలకు ఆర్థికంగా లాభం చేకూరనుంది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకోనున్నాయి. అయితే ఈ ట్రేడ్ డీల్ వల్ల కొన్ని వస్తువులపై అసలు సుంకాలే ఉండవు. మరి అవేంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

ఇది కూడా చూడండి: U19 World Cup 2026: ఆఫ్ఘన్‌ను ఊడ్చేసిన భారత కుర్రాళ్లు..  ఫైనల్లో భారత్ vs ఇంగ్లాండ్!

వీటిపై సుంకాలు లేవు..

అమెరికా నుంచి భారత్‌కు వచ్చే సుమారు 99 శాతం వస్తువులపై దిగుమతి పన్నులను భారత్ పూర్తిగా రద్దు చేయనుంది. గతంలో అమెరికా నుండి వచ్చే తయారీ వస్తువులపై సగటున 13.5 శాతం పన్ను ఉండేది. కానీ ఇప్పుడు అది సున్నాకు చేరింది. దీనివల్ల అమెరికాకు చెందిన యంత్రాలు, రసాయనాలు, అధునాతన వైద్య పరికరాలు భారత మార్కెట్‌లో తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. అలాగే అమెరికా నుంచి దిగుమతి అయ్యే బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, వివిధ రకాల పండ్లు, కూరగాయలపై పన్నులను భారత్ రద్దు చేసింది. దీనివల్ల సూపర్ మార్కెట్లలో విదేశీ పండ్లు, కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి: Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!

గతంలో వీటిపై భారీగా పన్నులు ఉండటం వల్ల ఇవి సామాన్యులకు భారంగా ఉండేవి. ఇప్పుడు సున్నా శాతం పన్నుతో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలో మరింత విరివిగా అందుబాటులోకి వస్తాయి. రష్యా చమురుకు భారత్ స్వస్థి పలికి.. అమెరికా వైపు అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని అమెరికా ప్రతినిధులు వెల్లడించారు. దీనికి ప్రత్యామ్నాయంగా భారత్ ఇకపై అమెరికా, వెనిజులా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోనుంది.

ఇది కూడా చూడండి: Mahesh kumar Goud : పవన్‌ ఆంధ్ర నాయకుడు.. తెలంగాణ వ్యతిరేకి:  మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్

భారీ పెట్టుబడులు, వాణిజ్య లోటు అమెరికాలోని వివిధ కీలక రంగాల్లో భారత్ సుమారు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇది అమెరికాలో ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. అయితే భారత్, అమెరికా వస్తువులపై పన్నులు రద్దు చేసినా, అమెరికా మాత్రం భారత్ నుంచి వచ్చే వస్తువులపై 18 శాతం పన్నును కొనసాగిస్తుంది. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటును తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రతినిధి జేమిసన్ గ్రీర్ స్పష్టం చేశారు. - PM Modi

ఇది కూడా చూడండి: Ustaad Bhagat Singh : అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్!..  ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Advertisment
తాజా కథనాలు