India-Pakistan: రేపే భారత్‌-పాక్‌ చర్చలు.. కాల్పుల విరమణ కొనసాగుతుందా ?

సోమవారం భారత్‌-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్‌(DGMO)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు గురించి చర్చలు జరపనున్నారు.

New Update
India-Pakistan talks

India Pakistan

భారత్‌-పాకిస్థాన్ శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. కానీ రాత్రికి మళ్లీ పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడింది. భారత ఆర్మీ వాటిని తిప్పికొట్టింది. అయితే మే 12న సోమవారం భారత్‌-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్‌(DGMO)లు పాల్గొననున్నారు.  

Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!

India-Pakistan Talks On 12th May 2025

కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత సోమవారం ఇరుదేశాల మధ్య జరగబోయే చర్చలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశంలో కాల్పుల విరమణ కొనసాగింపు, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం లాంటి అంశాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. శనివారం ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ.. పాకిస్థాన్‌ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణను ఉల్లంఘించి సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు యత్నించింది. కానీ మళ్లీ భారత్‌ వీటిని తిప్పికొట్టింది. దీంతో సోమవారం జరగబోయే చర్చల్లో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన అంశంపై కూడా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

ఇదిలాఉండగా.. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్‌ DGMOతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్‌లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణను అమలు చేద్దామని కోరారు. ఆ తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. కానీ శనివారం రాత్రి పాక్ దాన్ని ఉల్లంఘించి దొంగబుద్ధి చూపించింది. మరోవైపు ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదని తాజాగా ఎయిర్‌ఫోర్స్‌ కూడా ప్రకటన చేసింది. దీంతో రేపు ఇరుదేశాల మధ్య జరగబోయే చర్చలపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

Also Read: ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవడానికి కారణం ఇదే..!

Also Read: ఆ కలలో బతకొద్దు.. భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!

telugu-news | rtv-news | India-Pakistan Ceasefire | india pakistan ceasefire agreement | india pakistan ceasefire news | Indian Army | pakistan-army 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు