BREAKING: విమాన ప్రయాణికులకు అలర్ట్.. ఆ సిటీల్లో విమాన సర్వీసులు బంద్

పాక్ మళ్లీ రాత్రి జమ్మూకశ్మీర్‌పై డ్రోన్లు వేయడంతో ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ, అమృత్‌సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్, శ్రీనగర్‌కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది. అలాగే అటు నుంచి రావాల్సిన విమానాలను కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది.

New Update
Independence Day 2024: ఫ్లైట్ టిక్కెట్లపై 15% భారీ తగ్గింపు.. అదిరిపోయే ఆఫర్!

Indigo

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయినా కూడా పాక్ మళ్లీ జమ్మూకశ్మీర్‌పై డ్రోన్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇండిగో సంస్థ ప్రయాణికులకు అలర్ట్ తెలిపింది. మొత్తం 6  నగరాలకు విమానాలను రద్దు చేసింది. జమ్మూ, అమృత్‌సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్, శ్రీనగర్‌కు వెళ్లాల్సిన విమానాలతో పాటు వీటి నుంచి రావాల్సిన విమానాలను క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించింది. ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు ప్రయాణికులు ఒకసారి చెక్ చేసుకోవాలని ఎయిర్‌ఇండియా తెలిపింది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన..

ఇదిలా ఉండగా కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ మరో సారి ఉల్లంఘనకు పాల్పడింది. మా జోలికి వస్తే వైమానికి దాడులు చేస్తామని చేసి చూపించినా పాక్ తన వక్ర బుద్ధిని మరవలేకపోతుంది. జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం రాత్రి 15 నిమిషాల పాటు డ్రోన్లతో పాకిస్తాన్ అటాక్ చేసింది. భారత్ పాక్ డ్రోన్లను తిప్పికొట్టింది. గగనతలంలోనే పాకిస్తాన్‌ డ్రోన్లను కుప్పకూల్చింది ఇండియ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. బ్లాక్‌అవుట్ అమలు చేసి డ్రోన్లను కూల్చివేశారు.

ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

ఇది కూడా చూడండి:ఇప్పటివరకూ చూడని విధంగా మోదీ ఉగ్రరూపం.. పాక్‌ను ఏం చేయబోతున్నాడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు