/rtv/media/media_files/2025/05/12/ZCJxsCFqg2VLxftVCbQj.jpg)
పాక్, ఇండియా మధ్య జరిగిన ఘర్షణల గురించి త్రివిధ దళాధికారులు మీడియాకు వివరించారు. ఈక్రమంలో పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్ ప్రస్తావన వచ్చింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోడా జిల్లాలో కిరానా కొండలున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక రిజర్వ్ ప్రాంతంగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ పర్వతాల కింద నిర్మించిన బలమైన కాంక్రీట్ గుహల్లో అణ్వాయుధాలను పాకిస్థాన్ నిల్వ చేసినట్లు సమాచారం.
Kirana Hills, 8Kms near Sargodha PAF Air Base, was not hit by #India
— 🇮🇳Jester™ (@ItsJesterT) May 12, 2025
Nor we were aware it hosted Nuclear Assets of #Pakistan
Air Marshal Bharti
Bringing down to all conspiracy theories or giving air to it 🤔 pic.twitter.com/ZBu11Ud69b
సరిహద్దులో పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో ఆ దేశంలోని కీలకమైన సైనిక స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసింది. 8 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. భారత్ దాడుల్లో సర్గోడాలోని ముషఫ్ ఎయిర్‌బేస్ రన్‌వే ధ్వంసమైనట్లు శాటిలైట్ ఫొటోల్లో తెలుస్తోంది. కిరానా హిల్స్ కింద ఉన్న భూగర్భ అణు నిల్వలకు ఈ రన్ వే అనుసంధానంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అణు కేంద్రం సమీపంలో భారత్ దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పాకిస్తాన్ అణ్వాయుధాలు నిల్వ చేసిన చోటు గురించి బయటకు తెలిసింది. దీనిపై ఆర్మీ అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.
(pakistan | Indian Army | Indian Army Attack | Pakistan Kirana Hills)