BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాకిస్తాన్‌ బెదిరిస్తే ఇండియా సహించదని ప్రధాని మోదీ హెచ్చరించారు. బ్లాక్‌మెయిల్ చేస్తే వారినే టార్గెట్ చేసి అటాక్ చేస్తామని మోదీ పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ పోరు ఆపదని ప్రధాని తేల్చి చెప్పారు.

New Update
PM Modi

PM Modi

అణ్వాయుధాలు పేరు చెప్తే భారత్‌ని భయపెట్టలేరని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం జాతినుద్దేశించి మాట్లాతూ.. న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తామని పాకిస్తాన్ బ్లాక్‌మెయిల్ చేస్తే ఇండియా సహించదని మోదీ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలు ప్రయోగిస్తామని బెదిరించే వారినే టార్గెట్‌ చేసి దాడులు చేస్తామాని తేల్చి చెప్పారు. ఇటీవల భారత్ పాకిస్తాన్‌పై చేసిన దాడులు పాకిస్తాన్ అణ్వాయుధాలకు దగ్గరగా జరిగాయి. ఇండియా తలుచుకుంటూ అణ్వాయుధాలను కూడా నాశనం చేస్తామని పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

ఉగ్రవాదం, దాన్ని పెంచి పోషించే దేశం రెండూ వేరు వేరూ కాదని మోదీ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందని నొక్కి చెప్పారు. ఉగ్రవాదంపై భారతదేశం బలమైన వైఖరిని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఇప్పటి నుంచి ఏ ఉగ్రవాద దాడికైనా భారతదేశం తగిన సమాధానం ఇస్తుందని అన్నారు.

(nuclear attack | pm modi | india pak war | terrorist | pakistan | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు