IIT Madras: గోమూత్రం తాగితే.. జ్వరం పరార్

గోమూత్రం తాగితే జ్వరం నయమవుతుందని ఐఐటీ మద్రాస్‌ సంచాలకుడు కామకోటి తెలిపారు. గోమూత్రం అప్పుడపుడు అయిన తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా బయటకు వెళ్తుందన్నారు. తన తండ్రి జ్వరం వస్తే గోమూత్రం తాగేవారని, తగ్గేదని తెలిపారు.

New Update
IIT Kamakoti

IIT Kamakoti Photograph: (IIT Kamakoti)

గోమూత్రం తాగితే జ్వరం (Fever) పూర్తిగా నయమవుతుందని ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) సంచాలకుడు కామకోటి తెలిపారు. అప్పుడప్పుడు అయిన గోమూత్రం తీసుకోవాలని అతను తెలిపారు. సంక్రాంతి సమయంలో చెన్నై వెస్ట్‌ మాంబళంలోని గోశాలలో జరిగిన గోపూజలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా కామకోటి మాట్లాడిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Also Read :  డ్రాగన్ ఫ్రూట్‌తో మొటిమలు మాయం..ఎన్నో లాభాలు

Also Read :  నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు

అన్ని అనారోగ్య సమస్యల నుంచి..

కామకోటి తండ్రికి ఓ సారి జ్వరం వచ్చింది. అప్పుడు వైద్యుని వద్దకు వెళ్లమంటారా అని ఓ సన్యాసిని అడిగితే.. గోమూత్రం (Cow Urine) తాగితే తగ్గిపోతుందని ఆ సన్యాసి తెలిపినట్లు చెప్పారు. ఆయన తండ్రి గోమూత్రం తీసుకున్న 15 నిమిషాల్లోనే పూర్తిగా జ్వరం తగ్గిపోయిందని కామకోటి తెలిపారు. గోమూత్రం కేవలం జ్వరానికే కాదు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి చేస్తుందని, అతిపెద్ద ఔషధమని తెలిపారు. శరీరంలో ఉన్న హానికర బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి గోమూత్రానికి ఉందని తెలిపారు.

Also Read :  డెలివరీ తర్వాత ఆడవారి ప్రైవేట్ భాగంలో ఆవిరి పట్టడం కరెక్టేనా?

Also Read :  దాడి కేసులో కీలక మలుపు.. అసలైన నిందితుడు అరెస్టు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు