/rtv/media/media_files/2025/01/19/8GcaoBRU3RrGhNq45YPj.jpg)
Saif ali khan suspect arrested Photograph: (Saif ali khan suspect arrested)
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. దాడి చేసిన ఆ వ్యక్తి విజయ్ దాస్‌గా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చూడండి: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
ఓ లేబర్ క్యాంప్‌లో ఆశ్రయం పొందుతూ..
నేడు పోలీసులు ఈ నిందితుడిని విచారించనున్నారు. థానే జిల్లాలోని హీరానందని దగ్గర మెట్రో పనులు జరుగుతున్నాయి. దానికి సమీపంలో ఓ లేబర్ క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్న సమయంలో విజయ్ దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
Almost after three days of manhunt, Mumbai Police has arrested the man who had attacked actor Saif Ali Khan
— Munish Pandey (@MunishPandeyy) January 18, 2025
Vijay Das was working as a cleaner at a bar in Thane
Das allegedly entered Saif’s house with intention of theft, but when confronted, he attacked Saif with knife… pic.twitter.com/yIhWWWuPop
ఇది కూడా చూడండి:RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!
ముంబై బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే, ఆ సమయంలో సైఫ్ మేల్కొని అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా, దొంగ కత్తితో దాడి చేసి సైఫ్‌ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతో పాటు శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. వెంటనే సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని హాస్పిటల్ కి తరలించాడు. సైఫ్ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, వెన్నుముక భాగంలో పొడవడంతో అందులో ఉండే ద్రవం బయటకు వచ్చిందని డాక్టర్లు అన్నారు. కత్తిని బయటకు తీసి గాయాన్ని సరి చేశామని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Horoscope: నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు