Viral Video: ఏం ధైర్యం రా వాడిది..ఒకే బైక్‌ పై ముగ్గురు లేడీస్‌తో....

సాధారణంగా మనం బైక్‌పై నడుపుతున్న వ్యక్తికాక వెనుక మరో ఇద్దరు మహిళలు కూర్చున్న ఘటనలు తరచుగా చూస్తుంటాం. కానీ, ఒక వ్యక్తి తనతో పాటు ముగ్గురు మహిళలను బైక్‌ పై కూర్చోబెట్టుకోవడమే కాదు అందరినీ వన్‌ సైడ్‌ కూర్చోబెట్టుకుని బైక్‌ రైడ్‌ చేయడం సంచలనంగా మారింది.

New Update
with three ladies on the same bike...

With three ladies on one bike....

సాధారణంగా మనం బైక్‌పై నడుపుతున్న వ్యక్తికాక వెనుక మరో ఇద్దరు మహిళలు కూర్చున్న ఘటనలు తరచుగా చూస్తుంటాం. ఇంకా కొంచెం ఎక్కువైతే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ముందు పెట్రోల్‌ ట్యాంక్‌పైన కూర్చోబెట్టుకోవడం చూశాం. కానీ, ఒక వ్యక్తి తనతో పాటు ముగ్గురు మహిళలను బైక్‌ పై కూర్చోబెట్టుకోవడమే కాదు అందరినీ వన్‌ సైడ్‌ కూర్చోబెట్టుకుని బైక్‌ రైడ్‌ చేయడం సంచలనంగా మారింది. ముందు చిన్న పిల్లలు కూర్చుంటేనే హ్యాండిల్‌ తిప్పడానికి ఇబ్బంది అవుతుంటుంది. అలాంటిది ఓ వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను వన్ సైడ్ కూర్చోబెట్టుకుని..ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు. అంతేకాదు బైక్‌ పై ఉన్న మహిళలంతా కూడా కొంచెం లావుగానే ఉన్నారు., అయినా మనవాడు ఎలాంటి జంకుబొంకు లేకుండా బైక్‌ నడపడం విశేషం. 

Three Ladies On The Same Bike

ముగ్గురిని బైక్‌ పై కూర్చోబెట్టుకుని ఎంతదూరం నడిపాడో, అసలు అలా ఎలా హ్యాండిల్ తిప్పుతున్నాడో గానీ..ముగ్గురు రెడ్‌ శారీ కట్టుకున్న వారితో బైక్‌ పై దూసుకుపోతున్నాడు. కాగా వింతగా అనిపించిన ఈ ఘటనను కొంతమంది వ్యక్తులు కారులో వస్తూ వీడియో తీశారు. అ బైక్‌ ఎక్కడిదో.. సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేకున్నా వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. 

Also Read: సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడే.. పక్కా ప్లాన్‌తో దాడి చేశాడా?

హెచ్ఎఫ్ డీలక్స్ బైక్(HF Delux Bike) పైన.. ఇద్దరైతే ఈజీగా కూర్చోవచ్చు. డ్రైవింగ్ చేసే వ్యక్తితో పాటు మరొకరు మాత్రమే కూర్చుంటే చాలా సేఫ్టీగాఉంటుంది. తక్కువ దూరం తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే ముగ్గురుని తీసుకెళ్లడం శ్రేయస్కరం. కానీ ఈ వీడియోలో చూపించినట్లు.. నలుగురు వెళ్తే ప్రమాదమే అని పలువురు అంటున్నారు. కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తి.. అవన్ని పట్టించుకోకుండా ఏకంగా ముగ్గురు మహిళలను బైక్ పైన ఎక్కించుకోవడమే కాకుండా ఇద్దరు మహిళలు వెనకాల కూర్చోగా.. హైండిల్ పైన మరొకరిని కూర్చోబెట్టం చాలా ధైర్యమే అని చెప్పచ్చు. అని అంటున్నారు.

వాస్తవానికి చిన్న పిల్లాడు ముందు కూర్చుంటేనే హ్యాండిల్ తిరగదు. కానీ ఇతగాడు.. ఏకంగా ఆంటీనే ముందు కూర్చోబెట్టాడు అని కొందరంటున్నారు. ఈ వీడియో వైరల్(viral video) కావడంతో.. నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముందు కూడా ఆంటీ కూర్చుంటే హ్యాండిల్ ఎలా తిప్పుతావ్ బ్రో అంటూ కొంతమంది అంటే.. మరి కొంతమంది.. ముగ్గురు లేడీస్ ఒకే రంగు చీర కట్టుకున్నారని కామెంట్స్‌  పేల్చుతున్నారు.. . ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తే.. పాపం.! ఆ బైక్‌కు నోరు ఉంటే.. కుయ్యో.! మొర్రో.. అని మొత్తుకునేది అంటూ ఇంకా కొందరు రాసుకొచ్చారు.  ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ... రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో.. ఈ వీడియో చెక్కర్లు కొడుతోంది.

Also Read: ఆస్తికోసం అన్నతో బెడ్ షేర్ చేసుకున్న చెల్లి.. ప్రెగ్నెంట్ కావడంతో కోర్టు మెట్లెక్కిన పంచాయితీ!

Advertisment
తాజా కథనాలు