Karnataka: కర్ణాటకను భయపెడుతున్న గుండెపోటు మరణాలు.. ఆస్పత్రులకు క్యూకట్టిన జనం

కర్ణాటక రాష్ట్రం వరుస గుండెపోటు మరణాలతో కలవరపడుతోంది. దీంతో వేలాదిమంది భయంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఈ మరణాలు ప్రజలను భయపెడుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

New Update
heart attack

Heart attack deaths are scaring Karnataka

కర్ణాటక రాష్ట్రం వరుస గుండెపోటు మరణాలతో కలవరపడుతోంది. దీంతో వేలాది మంది భయంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఈ మరణాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఎలాంటి కారణం లేకుండా పలువురు మృత్యువాత పడటం రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ భయంతో గుండె సంబంధిత పరీక్షల కోసం ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మైసూరులోని ప్రముఖ ఆస్పత్రి అయిన జయదేవా ఆసుపత్రికి గుండెపోటు పరీక్షల కోసం వేలాది మంది తరలిరావడంతో ఆస్పత్రి కిక్కిరిసింది.

Also Read : పెంపుడు కుక్క వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలా! సర్వేలో షాకింగ్ విషయాలు

Heart Attack Deaths In Karnataka

కర్నాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఇటీవల అనేక మంది యువకులు ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రసారమవ్వడం, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అక్కడి ప్రజలకు భయం పట్టుకుంది. దీంతో తమకు అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీంతో పరీక్షల కోసం ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే, జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార అలవాట్లతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

కర్నాటక రాష్ట్రం హసన్‌ జిల్లాలో గడచిన 40 రోజుల్లో  23 మంది గుండెపోటుతో మరణించారు.  వీరే కాక ఇతర ప్రాంతాల్లోనూ పలువురు గుండెపోటుతో మరణించడంతో మైసూర్, బెంగళూర్ జయదేవా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. అయితే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్న ఈ మరణాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరణాలకు కారణాలను పరిశోధించేందుకు జయదేవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కెఎస్ రవీంద్రనాథ్ నేతృత్వంలోని ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Also read :  Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఎల్‌ అండ్‌ టీ సంచలన నిర్ణయం!

Also Read :  యూట్యూబర్లకు షాక్.. ఇకనుంచి ఆ వీడియోలకు డబ్బులు రావు

heart attack incident | Heart Attack In Children | heart-attack-risk | heart-attack | bengaluru | bengalore

Advertisment
Advertisment
తాజా కథనాలు