TS Police: పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 90 శాతం వరకు.. వివరాలివే!
తెలంగాణలో మరో సారి ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లను ప్రకటించారు పోలీసులు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై ఉన్న చలాన్లకు 90 శాతం డిస్కౌంట్, టూ వీలర్స్ కు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60, భారీ వాహనాలపై ఉన్న చలానాలకు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.