Telangana : డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్..!
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ సినీ దర్శకులు క్రిష్ విచాణకు హాజరయ్యారు. గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం క్రిష్ ను విచారించారు. ఆయన నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.