Money Investment: తక్కువ జీతమా అయినా పర్లేదు.. నెలకు రూ.1000 చొప్పున పెట్టుబడి పెడితే మీరే ధనవంతులు!

ప్రతీ నెల రూ.1000 సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 12 శాతం వరకు వడ్డీ వస్తుంది. మీరు ప్రతీ నెల రూ.1000 అంటే మొత్తం ఆరేళ్లకు కట్టినది రూ.72 వేలు మాత్రమే. కానీ మీకు లక్షకు పైగా డబ్బులు వస్తాయి. అయితే మీ జీతం బట్టి ఇన్వెస్ట్ చేస్తే రాబడి వస్తుంది.

New Update
SIP

SIP

భవిష్యత్తులో డబ్బులు బాగా సంపాదించాలంటే ప్రస్తుతం ఇన్వెస్ట్(Investment) చేస్తేనే అవుతుంది. అయితే ఎలాంటి నష్టం రాకుండా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలంటే సిప్‌(SIP) లో పెట్టుబడి పెట్టాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మందికి సిప్ గురించి తెలియదు. ఇంతకీ సిప్ అంటే ఏంటి? ఇందులో ఎలా? ఎంత? ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయో మీకు తెలియాలంటే ఈ స్టోరీపై లుక్కేయాల్సిందే.

ఇది కూడా చూడండి: Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. నేడు టాప్‌లో ఉన్న ఈ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు!

నెలకు వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే..

సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్స్‌(Mutual Funds) లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక పద్ధతి. చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టడానికి, అవసరమైనప్పుడు సులువుగా డబ్బు వెనక్కి తీసుకోవడానికి సిప్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సిప్‌లో మీరు రూ.100 నుంచి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ జీతం వచ్చే వారికి ఈ సిప్ బాగా ఉపయోగపడుతుంది. ఈ సిప్ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. అయితే చాలా మందికి రూ.15 వేల జీతం ఉంటుంది. ఉద్యోగం ప్రారంభంలో జాయిన్ అయినా ఇదే జీతం ఉంటుంది. ఈ జీతం వారు కూడా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సిప్ ద్వారా లాభాలు సంపాదించవచ్చు. అయితే నెలకు రూ.15 వేలు జీతం ఉన్నవారు ప్రతీ నెల రూ.1000 సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 12 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇలా మీరు ఆరు ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా లక్షకు పైగా అవుతుంది. అదే మీరు నెలకు రూ.2 వేలు చేస్తే మీకు వచ్చే డబ్బు రూ.2 లక్షలకు పైగా అవుతుంది. అయితే మీరు పెట్టుబడి పెట్టే దాని మీద మీకు 12 శాతం వడ్డీ లభిస్తుంది.

12 శాతం వడ్డీ..

మీరు ప్రతీ నెల రూ.1000 అంటే మొత్తం ఆరేళ్లకు కట్టినది రూ.72 వేలు మాత్రమే. కానీ మిగతా డబ్బులు మీకు వడ్డీ ద్వారా వస్తుంది. ఇలా మీరు తక్కువ డబ్బులను కూడా సిప్‌లో పొదుపు చేస్తే మీరు త్వరలోనే లక్షాధికారి అవుతారు. ఇలా మీరు వెయ్యి రూపాయలు మాత్రమే కాకుండా మీకు వచ్చే జీతం బట్టి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనివల్ల మీకు భవిష్యత్తులో బోలెడన్నీ లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే ఎక్కువ ఏళ్లు సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువగా లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మొత్తంలో అయినా సిప్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మీరు ఎంత ఎక్కువ  కాలం పెట్టుబడి పెడితే అంత ఎక్కువగా వస్తుంది.  తక్కువ ఏళ్లకు కాకుండా పదేళ్ల పాటు సిప్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు భారీగా లాభాలు వస్తాయి. కనీసంగా ఆరు ఏళ్లు అయినా సమయం పెట్టుకుంటే ఎక్కువగా లాభాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

ఇది కూడా చూడండి: Stock Market: పెరిగిన జీడీపీ..లాభాల్లో స్టాక్ మార్కెట్ పరుగులు

Advertisment
తాజా కథనాలు