/rtv/media/media_files/2025/07/22/gangster-murder-case-in-hospital-2025-07-22-09-36-08.jpg)
Gangster murder case in hospital.
Crime News: కొన్ని రోజుల క్రితం పట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్‌స్టర్ చందన్ మిశ్రాపై కాల్పులు జరిపి హత్య చేసిన కేసులో పోలీసులు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో, ఆరా పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానితులు ఎదురయ్యారు. అయితే వారు పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఈ హత్య కేసుకు సంబంధించిన ఇద్దరు అనుమానితులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.సోమవారం అర్ధరాత్రి మిశ్రా హత్య కేసుతో సంబంధం ఉన్న నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేయగా.. ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
lso Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ గ్యాంగ్‌స్టర్‌ను దుండగులు కాల్చి చంపిన కేసులో బిహార్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు.. ఒకరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పట్నాలోని పారస్ ఆస్పత్రిలోకి తుపాకీలతో ప్రవేశించిన ఐదుగురు దుండగులు.. అక్కడ చికిత్సపొందుతున్న చందన్ మిశ్రా అనే గ్యాంగ్‌స్టర్‌ను వెతికి మరీ కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో నిందితులందరినీ గుర్తించిన పోలీసులు తౌసిఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతా నలుగురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్
Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే