హైదరాబాద్లో కాల్పుల కలకలం.. సిటీ మొత్తం అలర్ట్
హైదరాబాద్లో బీదర్ దొంగల ముఠా కాల్పులు కలకలం రేపాయి. బీదర్లో ఓ ఏటీఎం వ్యాన్ కొల్లగొట్టిన దొంగల ముఠా డబ్బులతో పారిపోయి హైదరాబాద్ వచ్చింది. వారిని పట్టుకోవడానికి వచ్చిన బీదర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగల ముఠా మూడు రౌండ్ల కాల్పులు జరిపింది.