ATM : అసలే ఎండకాలం, పైగా కరెంట్ కోతలు.. ఏటీఎంలో చల్లగా ఉంటుందని అంతా అక్కడికెళ్లి..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో నిత్యం కరెంటు కోతలు విధిస్తున్నారు. అసలే ఎండకాలం కావడం, మరోవైపు రాత్రి, పగలు అని లేకుండా కరెంట్‌ తీసివేస్తున్నారు. దీంతో జనాలు ఉక్కపోతకు తట్టుకోలేక పోతున్నారు. అయితే ఓ కుటుంబం మాత్రం ఏకంగా ఏటీఎంలో పడుకుంటుండటం వైరల్ అయింది.

New Update
 Family sleeping in ATM

Family sleeping in ATM

ATM : అసలే ఎండకాలం, పైగా కరెంట్‌ కోతలు.. రాత్రిపూట ఇంట్లో నిద్రించాలంటే నరకం కనపడుతోంది. దీంతో ఓ కుటుంబం ఆరుబయట పడుకోవాలని దుప్పట్లు పట్టుకుని ఇంటి బయటకు వచ్చారు. అయితే వారికి ఎదురుగా ఒక ఏటీఎం కనిపించింది. అందులో లైటు వెలుగుతుండటంతో అంతా అక్కడికి వెళ్లారు, డోరు తీసి వెళ్లగానే చల్లగా అనిపించింది. ఇంకేం ఏ మాత్రం ఆలోచించకుండా ఆ రాత్రికి అక్కడే పడుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అక్కడే నిద్రించారు. అందరికీ చల్లగా నిద్రపట్టింది. ఇంకేం ఆలోచించలేదు. రాత్రి అయితే చాలు దుప్పట్లు పట్టుకుని వచ్చి అక్కడే నిద్రిస్తున్నారు. దీన్ని కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. అయితే జరిగింది తెలంగాణలో కాదు ఉత్తరప్రదేశ్‌లో..

Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!
 
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో నిత్యం కరెంటు కోతలు విధిస్తున్నారు. అసలే ఎండ కాలం కావడం, మరోవైపు రాత్రి, పగలు అని లేకుండా కరెంట్‌ తీసివేస్తున్నారు. దీంతో జనాలు ఉక్కపోతకు తట్టుకోలేక ఇండ్లముందు నిద్రిస్తున్నారు. అర్థరాత్రుళ్లు మంచి నిద్రలో ఉన్న సమయంలో కరెంటు తీసి వేస్తుండడంతో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆందోళనతో ఉత్తరప్రదేశ్‌ అట్టుడుకుతుంది.అర్ధరాత్రుళ్లు కచ్చితంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎవరు ఏం చేసినా అక్కడి సర్కారు మాత్రం స్పందించడం లేదు. దీంతో అక్కడి ప్రజలంతా వాకిళ్లు, మిద్దెలపైనే పడుకుంటున్నారు. ఉక్కపోతతో నిద్ర పట్టిన పట్టకపోయినా ఏదో పడుకున్నామా అంటే పడుకున్నాం అనిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: TG JOBS: గ్రూప్‌‌ 3, 4 పరీక్షల్లో కీలక మార్పులు.. మరో 27 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
 
ఇలాంటి సమస్యే ఓ కుటుంబానికి ఎదురైంది. రాత్రుళ్లు కరెంట్‌ తీసి వేస్తుండటంతో వారి పిల్లలు తరచుగా మేల్కొంటున్నారు. అర్థరాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారు. దీంతో రాత్రంతా బయట తిరుగుతూ గడుపుతున్నారు. అలా ఒకరోజు ఒక చోట లైట్ వెలుగుతూ కనిపించింది. తీరా అక్కడకు వెళ్లి  చూస్తే అది ఏటీఎం కాగా.. లోపలికి వెళ్లారు. అందులో చల్లగా ఉండేసరికి అక్కడే పడుకోవాలనుకున్నారు. అందులో ఇద్దరు మహిళలు.. తమ పిల్లలతో కలిసి రోజూ అక్కడే పడుకొంటున్నారు. మొదట ఈ విషయాన్ని ఎవరూ  గుర్తించకపోయినా.. ఆ తర్వాత అంతా దీన్ని చూశారు. అంతే వీడియోలు తీశారు.

ఇది కూడా చదవండి: Rajiv Gandhi: రాజీవ్ గాంధీ చనిపోయేముందు ఏం జరిగిందో తెలుసా ?

తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టగా.. నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అలా  ఈ వీడియో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కంట పడింది.. ఆయన దీన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారుతో పాటు విద్యుత్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి మీడియా అంతా అక్కడికి వెళ్లింది. ఏటీఎంలో పడుకోవడానికి గల కారణాలపై ఆరా తీసింది. కరెంటు కోతల వల్లే ఇలా పడుకోవాల్సి వచ్చిందని ఆ కుటుంబం చెప్పింది. దీంతో మీడియా దీన్ని హైలెట్‌ చేసింది.

 ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’ 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు