ATM : అసలే ఎండకాలం, పైగా కరెంట్ కోతలు.. ఏటీఎంలో చల్లగా ఉంటుందని అంతా అక్కడికెళ్లి..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో నిత్యం కరెంటు కోతలు విధిస్తున్నారు. అసలే ఎండకాలం కావడం, మరోవైపు రాత్రి, పగలు అని లేకుండా కరెంట్ తీసివేస్తున్నారు. దీంతో జనాలు ఉక్కపోతకు తట్టుకోలేక పోతున్నారు. అయితే ఓ కుటుంబం మాత్రం ఏకంగా ఏటీఎంలో పడుకుంటుండటం వైరల్ అయింది.