Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన.. పార్టీలో చేరిన మాజీ మంత్రి
మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పడాల అరుణ మెడలో జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు పవన్. ఈ సందర్భంగా జనసేన చీఫ్ మాట్లాడుతూ.. పడాల అరుణ లాంటి సీనియర్ నేతలు జనసేనలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే తనను పడాల అరుణ కలిశారని పవన్ గుర్తు చేశారు. ప్రజల కోసం తాను పడుతున్న తపనను, పోరాటం పట్ల ఆకర్షితురాలినైనట్లు వెల్లడించారు. మీ పోరాటంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని జనసేన పార్టీలో చేరతానన్నారని.. తాను స్వాగతించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.