/rtv/media/media_files/2025/01/29/rVyKktLDFafui6AQMDAx.jpg)
Old Monk Sant Siyaram Baba
Maha Kumbh: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అయితే 154 ఏళ్ల ఓ స్వామిజీ కుంభమేళాకు వచ్చాడని దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈయన కుంభమేళాకు హిమాలయాల నుంచి వచ్చారంటూ పలువులు పోస్టులు పెడుతున్నారు. ఇది నిజమని కొందరు అంటుంటూ మరికొందరు ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు.
Also Read: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!
154 ఏళ్ల స్వామిజీ వీడియో వైరల్..
అయితే ఫ్యాక్ట్‌చెక్‌లో ఈ వీడియోకి సంబంధించి కీలక విషయాలు బయటపడ్డాయి. వాస్తవానికి ఈ వీడియో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలలో తీసింది కాదు. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సంత్ సియారామ్ బాబా. ఈయన మధ్యప్రదేశ్‌లోని భట్టయాన్ భుజుర్గ్‌లో తన ఆశ్రమంలో 2024 డిసెంబర్‌లో శివైక్యం తీసుకున్నారు. అయితే సియారామ్ బాబా శివైక్యం పొందే సమయానికి ఆయన వయసు 94 నుంచి 110 ఏళ్లని తెలుస్తోంది (కచ్చితమైన వయసు తెలియదు).
Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
దీనికి సంబంధించిన వీడియో 2024లోనే ఒక ఎక్స్ ఖాతాలో షేర్ అయ్యింది. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి పేరు సియారామ్ బాబా అని, ఈయన 2024 డిసెంబర్ 11న శివైక్యం పొందారని ఆ పోస్టులో రాశారు. అలాగే మరో వీడియోలో ఈయనకు 188 ఏళ్లు అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో గత ఏడాది నుంచే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది కాబట్టి.. ఇది 2025 కుంభమేళాలో తీసింది కాదని నిర్ధారణ అయ్యింది. అలాగే సంత్ సియారామ్ బాబా 2024 డిసెంబర్ 11న మరణించినట్లు వార్తా కథనాలు కూడా వచ్చాయి. ఆయనకు 154 సంవత్సరాలు అని ఓ ఒక్క వార్తలో రాలేదు. అయితే ఆయన చనిపోయే నాటికి 94 నుంచి 110 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని మాత్రం తెలుస్తోంది.
🇮🇳 This Indian Man has just been found in a cave.
— Concerned Citizen (@BGatesIsaPyscho) October 3, 2024
It’s alleged he’s 188 years old. Insane. pic.twitter.com/a7DgyFWeY6
Also Read: మహా కుంభమేళా తొక్కిసలాటకు కారణం ఇదే !
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!