/rtv/media/media_files/2025/01/29/P2PgcvNcGEQ8xY9AKxfY.jpg)
Prayagraj Special trains Cancel news Railway Board Chairman Satish Kumar full clarity
Maha Kumbh Mela 2025: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కుంభమేళా వేడుకలో పాల్గొంటున్నారు. ఎన్నో కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
ఒక్కరోజే 10 కోట్ల మంది
ఇక నేటి మౌని అమావాస్యకు మరింత ప్రాముఖ్యత ఉండటంతో మరింత మంది ఈ వేడుక కోసం వెళ్లారు. ఇవాళ ఒక్కరోజే దాదాపు 10 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ చేరుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు పాటిస్తూ.. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, గొడవలు జరగకుండా పోలీసులను పెట్టింది.
Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం
తొక్కిసలాటలో 20 మంది మృతి
భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. వేకుజామున అనేక మంది భక్తులు స్నానాలు చేసేందుకు ఘాట్ల వద్దకు పరుగులు తీశారు. ఈ క్రమంలో చిమ్మచీకటికి కింద ఉన్న చెత్త డబ్బాలు కనిపించక కిందపడిపోయారు. దీంతో ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది మరణించారు. వందకి పైగా భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!
మొత్తం 360 స్పెషల్ ట్రైన్లు
అయితే కుంభమేళాలో తొక్కిసలాట జరగడంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు వాస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. నేడు మౌని అమావాస్య సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఉత్తర, ఈశాన్య, ఉత్తర మధ్య రైల్వే నుంచి దాదాపు 190 స్పెషల్ రైళ్లతో పాటు మొత్తంగా ప్రయాగ్ రాజ్‌కు 360 ట్రైన్లు నడుస్తాయని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ సతీష్ కుమార్ వెల్లడించారు.
Also Read: ISRO-GSLV-F15: షార్‌లో విజయ వంతంగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్ ప్రయోగం