Maha Kumbh Stampede: మహా కుంభమేళా తొక్కిసలాటకు కారణం ఇదే !

కుంభమేళా తొక్కిసలాటకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌని అమవాస్య కావడం వల్ల భక్తులు త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని సూచించారు. అయినప్పటికీ భక్తులు మాట వినకపోవడం, రద్దీ పెరగడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

New Update
Maha Kumbh Stampede

Maha Kumbh Stampede

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. అయితే తొక్కిసలాటకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం మౌని అమవాస్య కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటలకే కుంభమేళా డీఐజీ వైభవ్‌ కృష్ణ అలర్ట్ చేశారు. 

Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!

ఆ సమయంలో భక్తులు త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని సూచనలు చేశారు. అలాగే ఘాట్ల వద్ద రాత్రంతా నిద్రపోవద్దని కూడా హెచ్చరించారు. కానీ అప్పటికే భారీగా తరలివచ్చిన భక్తులు పోలీసుల మాటలు వినలేదు. రద్దీ కూడా ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.    

Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

ఇదిలాఉండగా.. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా వద్ద మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌  సెక్టార్ -2 వద్దకు వచ్చారు. అమృత స్నానాల కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తోపులాట జరగగా బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు.70 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు