Serial actress : సీరియల్ నటికి వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..

ఫేస్‌బుక్‌ వేదికగా తనను వేధిస్తోన్నయువకుడిపై కన్నడ, తెలుగు సీరియల్‌ నటి ఒకరు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఈమేరకు అతడిని అరెస్ట్‌ చేశారు.

New Update
FotoJet - 2025-11-04T111509.020

Serial actress harassed... after filing a complaint with the police...

Serial actress :ఫేస్‌బుక్‌ వేదికగా తనను వేధిస్తోన్న యువకుడిపై కన్నడ, తెలుగు సీరియల్‌ నటి ఒకరు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఈమేరకు  అతడిని అరెస్ట్‌ చేశారు.అంతర్జాతీయ టెక్నాలజీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

తెలుగు, కన్నడ టీవీ సీరియళ్లలో నటించే 41 ఏళ్ల నటికి మూడు నెలల క్రితం 'నవీన్జ్' అనే ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె దాన్ని అంగీకరించకపోయినా, మెసెంజర్ ద్వారా నిందితుడు రోజూ అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించాడు. నటి అతడిని బ్లాక్ చేయడంతో, అనేక కొత్త ఖాతాలు సృష్టించి వేధింపులను కొనసాగించాడు. అసభ్య సందేశాలతో పాటు తన మర్మాంగాల వీడియోలను కూడా పంపినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నవంబర్ 1న నిందితుడు మళ్లీ మెసేజ్ చేయడంతో నటి అతడిని నేరుగా కలవాలని కోరారు. అతడిని కలిసి వేధింపులు ఆపాలని హెచ్చరించినా వినలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి లైంగిక వేధింపులు, ఆన్‌లైన్ దుర్భాషల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని నవీన్ కె మోన్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. లండన్, పారిస్, న్యూయార్క్ వంటి నగరాల్లో కార్యాలయాలు ఉన్న ఓ గ్లోబల్ సంస్థలో అతను పనిచేస్తున్నట్లు తేలింది.

Also Read :  ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం!

Advertisment
తాజా కథనాలు