H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు శుభవార్త..ప్రాసెసింగ్ రీస్టార్ట్

హెచ్ 1బీ వీసాదారులకు యూఎస్ లేబర్ డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. H-1B, H-2A, H-2B, PERM వీసాల ప్రాసెసింగ్ మొదలైందని అనౌన్స్ చేసింది. ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్‌వే (FLAG) సిస్టమ్‌ తిరిగి ప్రారంభమైంది.

New Update
H1B Visa

H1B Visa

నిధుల లోపం కారణంగా అమెరికా(us) ప్రభుత్వం షట్ డౌన్ అయింది. ఈ క్రమంలో యూఎస్ లేబర్ డిపార్ట్ మెంట్(US Department Of Labor) కూడా మూతబడింది. దీంతో H-1B, H-2A, H-2B, PERM వీసాల ప్రాసెసింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఇది మొదలైందని అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ అనౌన్స్ చేసింది. ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్‌వే (FLAG) సిస్టమ్‌ తిరిగి ప్రారంభమైంది. దీంతో అమెరికాలో ఉన్న కంపెనీలు.. విదేశీ వర్కర్లను నియమించుకోవడానికి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ప్రాసెస్ లో ఉన్న అప్లికేషన్ల స్టేటస్ ను తెలుసుకోవడం, కొత్త వాటిని అప్లై చేసుకోవడం లాంటివి ఇక మీ చేయవచ్చును. ఇది ఒక రకంగా హెచ్1బీతో పాటు ఇతర వీసాలతో ఉద్యోగాలు పొందాలనుకుంటున్నవారికి మంచి పరిణామం.

Also Read :  వేదం సుబ్రహ్మణ్యానికి ఊరట.. డిపోర్ట్ చేయొద్దన్న కోర్టులు..

వీసాల ప్రాసెస్ మొదలైంది..

అమెరికాలో పని చేయాలంటే లేబర్ సర్టిఫికెట్లు కావాలి. దీన్ని OFLC ఇస్తుంది. H-1B(h-1b-visa), H-2A, H-2B, PERM వీసాలతో విదేశీ వర్కర్లను నియమించుకోవాలంటే అమెరికాలోని కంపెనీలు ఈ సర్టిఫికేట్ ను పొందాలి . అయితే FLAG అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. OFLC సర్టిఫికెట్ ఉంటేనే.. యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వద్ద హెచ్1బీ లాంటి వీసా పిటిషన్లు వేసుకోవడానికి వీలు కలుగుతుంది. లేకుంటే.. వీసా ప్రాసెస్ ముందుకు కదలదు. కాగా, విదేశీ టెక్ నిపుణల కోసం ఇచ్చేది హెచ్1బీ వీసా. ఇక తాత్కాలిక వ్యవసాయ రంగంలో ఉద్యోగాల కోసం H-2A వీసా ఇస్తారు. ఇతర రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం H-2B వీసా ఇస్తారు. PERM అంటే శాశ్వత ఉద్యోగాల కోసం ఇచ్చే వీసా ఇది.

షట్ డౌన్ కారణంగా లేబర్ డిపార్ట్ మెంట్ మూతబడింది. దీంతో ఫ్లాగ్ పోర్టల్ నిలిచిపోయింది. ఈ కారణంగా OFLC ముందు చాలా అప్లికేషన్లు ప్రాసెస్ కోసం ఎదురుచూస్తున్నాయి. 2024 మార్చిలో చేసిన దరఖాస్తులు.. 2025 జులై వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఫ్లాగ్ వ్యవస్థ ఒక క్రమంలోకి వచ్చేవరకు.. పర్మిట్ల ప్రాసెస్‌లో ఆలస్యం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: USA: వారం రోజుల్లో తేలనున్న ట్రంప్ భవితవ్యం? 33 రోజులుగా షట్ డౌన్ లో అమెరికా..

Advertisment
తాజా కథనాలు