/rtv/media/media_files/2025/07/24/the-wife-who-murdered-her-husband-2025-07-24-07-32-23.jpg)
\The wife who murdered her husband
Crime News : భార్య చేతిలో మరో మొగుడు బలి.. ఈ వార్త ఇప్పుడు సర్వసాధారణమైంది. భర్తలను చంపేస్తున్న భార్యలు.. నయా ట్రెండ్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలే కనిపిస్తున్నాయి.వివాహేతర సంబంధాలు, ఆర్థిక సమస్యలు, మద్యానికి అలవాటు పడిన భర్త , భర్తలతో నిత్యం గొడవలు ఇలాంటి పలు కారణాలతో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక, చేసుకున్న వాడితో ఉండలేక భర్తలకు విడాకులిస్తున్నవాళ్లు కొందరైతే.. పెళ్లి అయ్యాక భర్తతో నిత్యం గొడవ పడుతూ వారికి హాని కలిగిస్తున్న వాళ్లు మరికొందరు.. ఈ మర్డర్లు పెళ్లి అయినవారికి తమ భార్యలంటేనే భయపడేలా చేస్తుంటే...పెళ్లి కానీ వారు మాత్రం పెళ్లంటేనే పారిపోయేలా చేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో భార్య చేతిలో మరో భర్త హత్యకు గురయ్యాడు.
తమిళనాడులోని వేలూరు జిల్లా ఒడుకత్తూర్ కుప్పంపాళ్యానికి చెందిన భారత్(36) చెన్నైలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారి సంసారానికి గుర్తుగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత్ వంట మాస్టర్‌గా చేస్తుండంతో వారానికి ఒకసారి ఇంటికి వస్తుంటాడు. దీంతో నందిని తన ఎదురింట్లో ఉండే 21 ఏండ్ల సంజయ్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భారత్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు.
ఈ క్రమంలోనే ఈ నెల 21న ఇంటికొచ్చిన భారత్ సరకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్లాడు. ముగ్గురు తిరిగొస్తుండగా రోడ్డుకు అడ్డుగా కొబ్బరిమట్టలు ఉండటంతో వాటిని దాటే యత్నంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. అదే సమయంలో అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో భారత్‌పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. భారత్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నందినిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వారివెంట ఉన్న చిన్న కుమార్తెను ఆరా తీయగా.. సంజయ్ మామ తన తండ్రిపై దాడి చేసినట్లు చెప్పింది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భారత్‌ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చి, జైలుకు తరలించారు.
Also Read: షాకింగ్ వీడియో.. యువతిని ఉతికారేశాడు - కడుపులో తన్ని, జుట్టు పట్టుకుని ఈడ్చేసిన యువకుడు!