/rtv/media/media_files/2025/08/16/election-commission-2025-08-16-20-03-02.jpg)
Election Commission
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డాయని తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలకు బదులిచ్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు సమాచారం. ఓట్ల చోరీ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు 17న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై ఈసీ ఎలాంటి వివరణ ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
The Election Commission of India to hold a press conference at 3 PM, August 17, 2025, at the National Media Centre in New Delhi: DG Media ECI pic.twitter.com/HA5bbt7UWx
— ANI (@ANI) August 16, 2025
Also Read: కాల్పుల విరమణకు అంగీకరించం.. ట్రంప్ ముందే పుతిన్ సంచలనం.. వీడియో వైరల్
మరోవైపు రాహుల్ గాంధీ బిహార్‌లో ఓటు అధికార యాత్రను ఆదివారమే ప్రారంభించనున్నారు. అదే రోజున ఎన్నికల సంఘం మీడియా ముందుకు రానుండటం చర్చనీయాంశమవుతోంది. సాధారణంగా ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేటప్పుడు మాత్రమే మీడియా సమావేశం నిర్వహిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఓ వివాదంపై వివరణ ఇచ్చేందుకు ముందుకు రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే విపక్ష పార్టీలో పార్లమెంటు బయట కూడా ఓటు చోరీ నినాదాలు చేస్తూ ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేసేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. పోలీసులు వాళ్లని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
Also Read: వీధి కుక్కల వల్ల ఇన్ని లాభాలా.. అవి లేకుంటే భయంకరమైన వ్యాధులే
ఇటీవల బిహార్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIT) చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటరు జాబితాలో 65 లక్షల మంది ఓటర్లను తొలగించడంపై పెద్దఎత్తున వివాదం తలెత్తింది. అనంతరం రాహుల్ గాంధీ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి.. బీజేపీ, ఈసీపీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని ఒక్క మహదేవపుర నియోజకవర్గంలోనే లక్ష ఓట్లు చోరీ అయ్యాయని విమర్శలు చేశారు.
Also Read: కూతురును పట్టించుకోవడం లేదు..భారత పేసర్ షమీ పై భార్య సంచలన ఆరోపణలు
అలాగే మహారాష్ట్ర, హర్యానాలో కూడా ఓట్లు చోరికి గురయ్యాని ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఆరోపణలపై లిఖితపూర్వకంగా తమకు డిక్లరేషన్ ఇవ్వాలని ఈసీ రాహుల్‌గాంధీని కోరింది. లేకపోతే దేశానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ఓట్ల చోరీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చాలామంది నెటిజన్లు ఓట్ల చోరీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసీ దీనిపై వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆన్‌లైన్‌లో ఓ క్యాంపెయిన్‌ను నడిపిస్తున్నారు.
Also Read: డాగ్ లవర్స్‌కు RGV షాకింగ్ VIDEO.. దిమ్మతిరిగే కౌంటర్లు