Stray Dogs: వీధి కుక్కల వల్ల ఇన్ని లాభాలా.. అవి లేకుంటే భయంకరమైన వ్యాధులే

రాజధాని ఢిల్లీలో రోజుకు 2వేల కుక్క కాటు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. ఇన్ని జరుగుతున్న వాటిని మనం భరించాలా అంటే.. అవుననే అంటున్నారు కొందరు జంతు ప్రేమికులు, వెటర్నరీ నిపుణులు. వీధి కుక్కల వల్ల జరిగే లాభాలు కూడా ఉన్నాయట.

New Update
Dogs in delhi

వీధి కుక్కలు చూస్తే చాలామందికి భయం.. మరికొందరికి చిరాకు, కోపం. ఈ వీధికుక్కల కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. చిన్నారులపై కుక్కల దాడి అనే వార్తలు కూడా తరుచూ ఇటీవల వస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 6కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని అంచనా.. అందులో ఒక్క ఢిల్లీలోనే 10 లక్షల వీధికుక్కలు(Delhi in Stray Dogs) ఉన్నాయని కుక్కల జనాభా ద్వారా తెలుస్తోంది. రాజధాని ఢిల్లీలో రోజుకు 2వేల కుక్క కాటు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. ఇన్ని జరుగుతున్న వాటిని మనం భరించాలా అంటే.. అవుననే అంటున్నారు కొందరు జంతు ప్రేమికులు, వెటర్నరీ నిపుణులు. వీధి కుక్కల వల్ల జరిగే లాభాలు కూడా ఉన్నాయట. రోడ్లపై వీధి కుక్కలు లేకుంటే ఏం జరుగుతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రోడ్డుపై నడుచుకుంటూ, బైక్‌పై వెళ్లే వారిపై వీధి కుక్కలు దాడి చేస్తాయి. చిన్న పిల్లల సంగతి అయితే చెప్పనక్కరలేదు. దీంతో వీధి కుక్కలపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. సుప్రీం కోర్టు సమోటోగా తీసుకొని ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. దీంతో కొంతమంది జంతుప్రేమికులు సుప్రీం కోర్టు తీర్పును ఖండించారు. కుక్కలను స్వేచ్ఛగా రోడ్లపై తిరగనివ్వడని అంటూ సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ఈక్రమంలోనే వీధి కుక్కల ప్రాదాన్యత గురించి మనం తెలుసుకోవాల్సిందే.

Also Read :  డాగ్ లవర్స్‌కు RGV షాకింగ్ VIDEO.. దిమ్మతిరిగే కౌంటర్లు

Benefits Of Stray Dogs

ప్రమాదంలో జీవవైవిద్యం
వీధి కుక్కల్ని పూర్తిగా నిర్మూలిస్తే జీవవైవిద్యం దెబ్బతింటోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కుక్కలు.. ఎలుకలు, పంది కొక్కుల్ని చంపి తింటాయి. మొత్తం కుక్కలను వీధుల్ని నుంచి నిర్మూలిస్తే ఎలుకలు పంది  కొక్కుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అలాగే ఇప్పటికే కోతులు ఇళ్లపై దాడి చేస్తున్నాయి. అడవులు అంతమవుతుండటంలో కోతులు ఊళ్లపై పడుతున్నాయి. అవి ప్రస్తుతం గ్రామాల్లో చెట్లపైకే వస్తున్నాయి. కుక్కలు లేకపోతే  కోతులు అన్ని వీధుల్లో నిండి పోతాయి. 

పారిశుధ్య కార్మికుల్లా వీధి కుక్కలు
వీధి కుక్కలు(stray-dogs) పారిశుధ్య కార్మికుల్లా పని చేస్తాయి. అవి లేకపొతే వీధుల్లో మలినాలు బాగా పెరిగి పోతాయి. మనుషులు తిని పడేసిన ఆహార పదార్థాలు, మాంసం వ్యర్థాలు అలాగే ఉండిపోతాయి. వాటి వల్ల కలరా లాంటి అంటూ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. వీధి కుక్కలు ఇంట్లో నుంచి వచ్చే వ్యర్థాలను తిని పారిశుద్ధ్య కార్మికుల్లా పని చేస్తాయి.

దొంగల నుంచి రక్షణ
వీధి కుక్కలు గ్రామాల్లో దొంగల నుంచి రక్షణ ఇస్తాయి. కుక్కలు ఉంటే దొంగలు చోరీలకు పాల్పడాలంటే జంకుతారు. 

మానసిక ప్రయోజనాలు:
ఒంటరిగా ఉన్న వారికి, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి వీధి కుక్కలు మంచి స్నేహితులుగా మారతాయి. వాటితో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, వాటితో ఆడుకోవడం వల్ల ప్రజల్లో సానుభూతి, బాధ్యత పెరిగి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వీధి కుక్కల వల్ల కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం కుక్కలను చంపడమో, వాటిని శాశ్వతంగా తొలగించడమో కాదు. సరైన పద్ధతులను అనుసరించి, వాటి సంఖ్యను నియంత్రించడం, రేబిస్ వంటి వ్యాధులు ప్రబలకుండా టీకాలు వేయించడం, వాటికి సరైన ఆశ్రయం కల్పించడం వంటి చర్యలు తీసుకోవడం అవసరం. ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తేనే ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Also Read :  తుంగ భద్రకు పొంచి ఉన్న ముప్పు?.. పనిచేయని గేట్లు..

Advertisment
తాజా కథనాలు