/rtv/media/media_files/2025/07/02/kolkata-high-court-gave-big-shock-to-shami-2025-07-02-13-33-03.jpg)
Kolkata High Court Gave Big Shock To Shami
మహ్మద్ షమీ, అతని భార్య హసీన్ జహాన్ కొన్నేళ్ళ క్రితం విడిపోయారు. వీరిద్దరికి ఐరా అనే పాప ఉంది. పాప ప్రస్తుతం అమ్మ దగ్గరే ఉంటోంది. హసీన్...షమీ విడిపోయినా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. దీనికి కారణం అతనిపై ఆమె ఎప్పుడూ ఏవో ఒక ఆరోపణలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి షమీ పై జహాన్ విరుచుకుపడ్డారు. కూతురు ఐరాను పట్టించుకోవడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. షమీ తన గర్ల్ ఫ్రెండ్స్ పిల్లలకు ప్రాధాన్యత ఇస్తాడు, వారికి ఖరీదైన బహుమతుల్ని ఇస్తాడు కానీ కూతురిని మాత్రం పూర్తిగా విస్మరించాడని ఆమె ఆరోపణలు చేశారు. కనీసం స్కూల్ చదువుకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు. ఐరా తండ్రి బిలియనీర్ అయి ఉండీ.. తన ఉంపుడుగత్తెల పిల్లలను ఉన్నత పాఠశాలల్లో చదివేందుకు సహకరిస్తున్నాడని.. కూతురి చదువుకు మాత్రం డబ్బులేదని చెబుతున్నాడని పరుషపదజాలంతో తిట్టారు. వారికి బిజినెస్ క్లాస్ విమానాల్లో టూర్ లకు ఖర్చు చేస్తాడు కానీ కూతురికి చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు.
షమీపై గృహహింస ఆరోపణలు..కోర్టులో కేసు..
ఇటీవలే కలకత్తా హైకోర్టు మహ్మద్ షమీ తన మాజీ భార్య హసీన్ జహాకు నెలకు రూ.1.5 లక్షలు, కుమార్తె ఐరాకు నెలకు రూ.2.5 లక్షలు కలిపి మొత్తం రూ.4 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. షమీ, హసీన్‌కు 2014లో వివాహం జరగ్గా.. 2015లో ఐరా పుట్టింది. 2018లో షమీపై హసీన్ గృహ హింస ఆరోపణలు చేశారు. ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. మరోవైపు షమీ భార్య హసీనా, కూతురు ఐరాపై క్రిమినల్ కేసు నమోదు అయింది. హసీన్, ఐరాపై హత్యాయత్నం (Attempt to Murder) కేసు నమోదైనట్లు సమాచారం. ఆస్తి వివాదం విషయంలో వీరిద్దరూ దలియా ఖాతూన్ అనే మహిళపై దాడి చేశారని పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలోని సూరి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదుతో హసీన్ జహా, అర్షి జహాపై BNS లోని 126(2), 115(2), 117(2), 109, 351(3), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. పశ్చిమ బెంగాల్‌లోని సూరి పట్టణంలోని వార్డ్ నంబర్ 5లో హసీన్ జహా, అర్షి జహా నివాసం ఉంటున్నారు. ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వారు ఇటీవల నిర్మాణం మొదలుపెట్టారు. దలియా ఖాతూన్ ఈ నిర్మాణం ఆపడానికి ప్రయత్నించగా.. ఆమెపై హసీన్, ఐరా దాడికి దిగినట్లు చెబుతున్నారు.
Also Read: BIG BREAKING: కాల్పుల విరమణ లేదు..ముందుకు సాగని చర్చలు