Road Accident: షాకింగ్ వీడియో.. ఘోరమైన యాక్సిడెంట్ - ముగ్గురు టీచర్లు సహా ఐదుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధా జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు, ఒక మైనర్ బాలిక, కారు డ్రైవర్ ఉన్నారు.

New Update
Kawardha Road Accident

Kawardha Road Accident


కబీర్‌ధామ్‌లోని 30వ నేషనల్ హైవే పై జరిగిన ఒక ఘోరమైన ప్రమాదం ఆ ప్రాంతమంతా కుదిపేసింది. బొలెరో, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బొలెరో డ్రైవర్, ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు, ఒక ప్రయాణికుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Kawardha Road Accident

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే 30 (రాయ్‌పూర్-జబల్‌పూర్ రోడ్డు) లోని అకల్‌ఘారియా గ్రామం సమీపంలో బొలెరో, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు, ఒక మైనర్ బాలిక, కారు డ్రైవర్ ఉన్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వాసులు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన తర్వాత గ్రామస్తులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే చిల్ఫీ పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. తీవ్రంగా గాయపడిన నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం మృతులను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 

ఈ ప్రమాదంపై పోలీసులు మాట్లాడారు. ‘‘బొలెరో వాహనం ప్రయాణికులను తీసుకెళ్తుండగా.. రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఒక ట్రక్కు దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో బొలెరో నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్, ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు, మరో ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం తరువాత దెబ్బతిన్న వాహనాలను హైవే నుండి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశాం. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం.’’ అని ఒక పోలీసు అధికారి మీడియాతో తెలిపారు.

Advertisment
తాజా కథనాలు