Telangana Assembly Elections: తెలంగాణ సీఈవో కీలక ప్రకటన.. వారికి రేపు సెలవు..
తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రేపు అంటే డిసెంబర్ 1వ తేదీన ప్రత్యేకంగా సెలవు ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు.